Asianet News TeluguAsianet News Telugu

కుడి ఎడమైనా అది మాత్రం పక్కా! లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో ఇంప్రెస్ చేసిన జో రూట్... పాక్ ముందు...

లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి చూడచక్కని షాట్లతో మెప్పించిన జో రూట్... పాకిస్తాన్ ముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్.. 

Joe root impresses with left hand batting in Pakistan vs England 1st Test
Author
First Published Dec 5, 2022, 12:14 PM IST

‘నా పేరు సూర్య’ సినిమాలో అల్లు అర్జున్ ‘లవర్ ఆల్‌సో.. ఫైటర్ ఆల్‌సో...’ అన్నట్టుగా, ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్... ‘రైట్ హ్యాండర్ ఆల్‌సో... లెఫ్ట్ హ్యాండర్ ఆల్‌సో...’ అంటున్నాడు. కుడి చేత్తో బ్యాటింగ్ చేసేవాళ్లు, అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌కి మారి కొన్ని క్రేజీ షాట్లు ఆడుతుండడం చాలా కామన్. అయితే రైట్ హ్యాండెడ్ బ్యాటర్, పూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా పొజిషన్ తీసుకుని బ్యాటింగ్ చేసి ఇంప్రెస్ చేయడం మాత్రం చాలా కష్టం. 

స్వతాహాగా లెఫ్ట్ హ్యాండర్ అయినా రైట్ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో టెన్నుల కొద్దీ పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడేవాడు.  అయితే జో రూట్ చాలా తేలిగ్గా ఈ పని చేసేశాడు... ప్రస్తుతం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు, రావల్పిండిలో తొలి టెస్టు ఆడుతోంది. 

మొదటి ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో 657 పరుగుల భారీ స్కోరు చేసింది ఇంగ్లాండ్. తారు రోడ్డు లాంటి పిచ్‌పై పాకిస్తాన్ బ్యాటర్లు కూడా చెలరేగిపోయారు. ఓపెనర్లతో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన జో రూట్, జహీద్ మహమూద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో లెగ్ స్పిన్నర్ జాహీద్ మహమూద్ బౌలింగ్‌ని ఫేస్ చేసేందుకు ఇబ్బంది పడ్డ జో రూట్... రెండో ఇన్నింగ్స్‌లో అతని బౌలింగ్‌లో ఈజీగా పరుగులు చేసేందుకు వీలుగా బ్యాటింగ్ పొజిషన్ మార్చాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసి చక్కగా స్వీప్ షాట్ ఆడాడు...

‘నేను రైట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా స్వీప్ షాట్ ఆడలేను, అలాంటి జో రూట్ పర్ఫెక్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌లా స్వీప్ షాట్ ఆడేశాడు. అది కూడా టెస్టు మ్యాచ్‌లో... ఇంక్రీడబుల్...’ అంటూ ట్వీట్ చేశాడు సౌతాఫ్రికా స్పిన్నర్ తంబ్రేజ్ షంసీ.  రెండో ఇన్నింగ్స్‌లో 69 బంతుల్లో 6 ఫోర్లతో 73 పరుగులు చేసి జహీద్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...

తొలి ఇన్నింగ్స్‌లో 6.5+ రన్ రేట్ రేటుతో పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 7.4+ రన్ రేటుతో పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసింది. పాకిస్తాన్ ముందు 343 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది ఇంగ్లాండ్ జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగిన అబ్దుల్లా షెఫీక్ 6 పరుగులు చేసి అవుట్ కాగా ఇమామ్ వుల్ హక్ 44 పరుగులకి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

వన్‌డౌన్‌లో వచ్చిన అజర్ ఆలీ ఖాతా తెరవకుండానే రిటైర్డ్ హార్ట్‌గా పెవిలియన్ చేరాడు. 89 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ జట్టును సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ 20 ఓవర్లుగా బ్యాటింగ్ చేస్తూ 60+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆట మరో రెండు సెషన్ల పాటు సాగనుండడంతో మ్యాచ్ ఫలితం తేలుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.. 

Follow Us:
Download App:
  • android
  • ios