న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీశమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. ఫన్నీ ఫన్నీ పోస్టులకు రిప్లై ఇచ్చే జిమ్మీ, తన ఐపీఎల్ 2020 సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్ పెట్టిన ఓ పోస్టుపై షాకింగ్ కామెంట్ చేశాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ తరుపున ఆడిన మయాంక్ అగర్వాల్, ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌ టెస్టు జట్టులో ఉన్నాడు.శుబ్‌మన్ గిల్ రాణిస్తుండడం, గత ఆస్ట్రేలియా టూర్‌లో మయాంక్ అగర్వాల్ ఫెయిల్ కావడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు.

అయితే పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్న మయాంక్ అగర్వాల్... జిమ్‌లో హెవీ వర్కవుట్స్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. కళ్లు మూసుకుని తెగ కష్టపడుతున్నట్టుగా ఈ ఫోటోపై ‘కంగ్రాట్స్... అబ్బాయా? లేక అమ్మాయా?’ అంటూ కామెంట్ చేశాడు జిమ్మీ నీశమ్.

జిమ్మీ చేసిన కామెంట్‌కి సోషల్ మీడియా జనాలందరూ షాక్ అయ్యాడు. జిమ్మీ నీశమ్ కామెంట్‌కి 16 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో  పంజాబ్ తరుపున ఆడిన జిమ్మీ నీశమ్, పెద్దగా రాణించలేకపోయాడు. దాంతో అతన్ని వేలానికి విడుదల చేసింది పంజాబ్. ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే అతన్ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.