Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ అరోన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్... 98 పరుగులకే మధ్యప్రదేశ్ ఆలౌట్... జార్ఖండ్ భారీ విజయం...

94 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో 173 పరుగులు చేసిన ఇషాన్ కిషన్...

39 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసిన అనుకుల్ రాయ్...

ఆరు వికెట్లు తీసిన వరుణ్ అరోన్...

Jharkhand Registered Record win in Vijay Hazare Trophy, after MP all-out for 98 CRA
Author
India, First Published Feb 20, 2021, 3:53 PM IST

విజయ్ హాజరే ట్రోఫీ 2021లో జార్ఖండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 422 పరుగుల భారీ స్కోరు చేసింది జార్ఖండ్.

ఇషాన్ కిషన్ 94 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో 173 పరుగులు చేసి అవుట్ కాగా విరాట్ సింగ్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు, అనుకుల్ రాయ్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు, సుమిత్ కుమార్ 58 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశారు.

లిస్టు ఏ క్రికెట్‌లో ఇది రెండో అతి పెద్ద స్కోరు. 423 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన మధ్య ప్రదేశ్ 98 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జార్ఖండ్ జట్టుకి 324 పరుగుల తేడాతో అఖండ విజయం దక్కింది. లిస్టు ఏ క్రికెట్‌లో ఇది రెండో అతిపెద్ద విజయం.

మధ్యప్రదేశ్ ఓపెనర్ అభిషేక్ బండారి 57 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేయగా, వెంకటేశ్ అయ్యర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ మినహా మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు.

ఐపీఎల్వే 2021 వేలంలో అమ్ముడుపోని భారత ప్లేయర్ వరుణ్ అరోన్ 5.4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. బాల్ కృష్ణ 2 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ వేలంలో బేస్ ప్రైజ్‌కి అమ్ముడుపోయిన ఉత్కర్ష్ సింగ్ 6 పరుగులు చేయగా, రజత్ పటిదార్ 6 పరుగులు చేసి నిరాశపరిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios