జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ షో! బంగ్లాదేశ్‌పై రివెంజ్ తీర్చుకున్న టీమిండియా... రెండో వన్డేలో ఘన విజయం..
రెండో వన్డేలో 108 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు... వన్డే సిరీస్ 1-1 తేడాతో సమం..

బంగ్లాదేశ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత ఘన విజయంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత మహిళల జట్టు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి వన్డేలో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 40 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, రెండో వన్డేలో 108 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.. భారత యంగ్ సెన్సేషన్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. వరుసగా విఫలం అవుతున్న షెఫాలీ వర్మ స్థానంలో ప్రియా పునియా ఓపెనర్‌గా వచ్చింది. 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ప్రియా పునియా, మరుఫా అక్తర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది..
వికెట్ కీపర్ యషికా భాటియా 23 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి రనౌట్ కాగా స్మృతి మంధాన 58 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసి రబేయా ఖాన్ బౌలింగ్‌లో అవుటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 3 ఫోర్లతో 52 పరుగులు చేయగా జెమీమా రోడ్రిగ్స్ 78 బంతుల్లో 9 ఫోర్లతో 86 పరుగులు చేసింది..
హర్లీన్ డియోల్ 36 బంతుల్లో 25 పరుగులు చేయగా దీప్తి శర్మ డకౌట్ అయ్యింది. స్నేహ్ రాణా 1 పరుగు చేసి రనౌట్ కాగా అమన్‌జోత్ కౌర్ 3 పరుగులు చేసింది.
229 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్, 35.1 ఓవర్లలో 120 పరుగులకి ఆలౌట్ అయ్యింది. షర్మిన్ అక్తర్ 2, ముర్సిదా ఖటూన్ 12 పరుగులు చేసి అవుట్ కాగా లతా మొండల్ 9 పరుగులు చేసింది. ఫర్హనా హక్ 81 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేయగా రితూ మోనీ 46 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసింది...
కెప్టెన్ నిగర్ సుల్తాన్ 3, రబేయా ఖాన్ 1, నహీదా అక్తర్ 2, మురూఫా అక్తర్ 1 పరుగు చేసి అవుట్ కాగా సుల్తానా ఖటూన్ డకౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో 86 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్.. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. దేవికా వైద్యకి 3 వికెట్లు దక్కగా మేఘనా సింగ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణాలకు తలా ఓ వికెట్ దక్కాయి..
ఒకే వన్డేలో 50+ పరుగులు చేసి, 4 వికెట్లు తీసిన మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది జెమీమా రోడ్రిగ్స్.