సౌరాష్ట్రకు రంజీ ట్రోఫీని అందించిన క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ తన నిశ్చితార్థంతో అభిమానులను ఆశ్చర్యచకితులను చేశాడు. సౌరాష్ట్రకు ఆయన కెప్టెన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

రినీతో ఆయన నిశ్చితార్థం ఆదివారంనాడు జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. టీమిండియా బ్యాట్స్ మన్ ఛతేశ్వర్ పుజారా ఈ వేడుకకు హాజరయ్యాడు. ఆరు గంటలు, రెండు భోజనాలు, ఓ కేక్ అని ఆ చిత్రాలకు ఉనద్కత్ శీర్షిక పెట్టాడు.

ఉనద్కత్ కు కాబోయే భార్య కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించి ఓ పోస్టు పెట్టారు.ఎప్పుడైతే చీజ్ మీద ఉన్న ప్రేమకన్నా ఎవరిమీదనైనా ప్రేమ కలిగితే... అప్పుడు నేను జీవితభాగస్వామిని కనుగొన్నానని అర్థం అని రాసుకొచ్చి వెంటనే అప్డేట్ అని కాప్షన్ పెట్టి "నేను ప్రేమను కనుగొన్నాను" అని ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 

ఈ జంటకు క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడా శుభాకాంక్షలు తెలిపాడు. సౌరాష్ట్ర టీం కి ఉనద్కత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అదే టీంలో చటేశ్వర్ పుజారా కూడా ఆడుతున్నాడు. 

చరిత్ర సృష్టిస్తూ ఈసారి రంజీ ట్రోఫీని సౌరాష్ట్ర టీం తొలిసారి గెలుచుకుంది. ఆ టీం ఆ టైటిల్ ను గెలవడంతో ఉనద్కత్ పాత్ర అత్యంత కీలకం. బెంగాల్ కు అడ్డుకట్ట వేసి వారి ఆశలపై నీళ్లు చల్లడంలో ఉనద్కత్ అత్యంత కీలకంగా వ్యవహరించాడు.