Jay Shah's journey : జిల్లాస్థాయి నుంచి ప్రపంచ క్రికెట్ బాస్ వరకు.. చరిత్ర సృష్టించిన జైషా
Jay Shah's journey : బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌కు బాస్ అయ్యారు. ఐసీసీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఐసీసీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన బాస్ గా రికార్డు సృష్టించారు జైషా.
Jay Shah's journey : జిల్లా స్థాయి నుంచి ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగారు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషా. బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌కు బాస్‌గా మారారు. ఐసీసీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఐసీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే ఇప్పటికే రెండు పర్యాయాలు వరుసగా ఐసీసీ ఛైర్మన్ గా సేవలు అందించారు. అయితే, మూడోసారి నామినేషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ పదవి ఖాళీ అయింది. నవంబర్ 30తో బార్క్లే పదవీకాలం పూర్తవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన జైషా డిసెంబరు 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.
జిల్లాస్థాయి నుంచి ఐసీసీ చీఫ్ వరకు జైషా ప్రయాణం..
35 సంవత్సరాల వయస్సులో జైషా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్ (సీబీసీఏ)తో జిల్లా స్థాయిలో పని చేయడం ప్రారంభించినప్పుడు జైషా క్రికెట్ పరిపాలనలోకి అధికారికంగా ప్రవేశించారు. ఆ తర్వాత గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) లో ఎగ్జిక్యూటివ్‌గా రాష్ట్ర స్థాయి విభాగంలో చేరారు. ఇక చివరికి 2013లో దాని జాయింట్ సెక్రటరీ అయ్యారు. జీసీఏలో తన పదవీకాలంలో ఆటగాళ్ళు బాగా ఉండేలా నిర్ధారిత వయస్సు గల కోచింగ్ వ్యవస్థను ఏర్పాటు, గుజరాత్ 2016-17లో రంజీ ట్రోఫీ విజయం సాధించడంలో షా మార్క్ తో మరింత గుర్తింపును సాధించారు.
జైషా భారత క్రికెట్ జట్టులోని వివిధ స్థాయిలలోని ఆటగాళ్లతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలిగారు.ఐసీసీకి వెళ్లే ముందు విశ్వసనీయ సీనియర్ ఆటగాళ్ల నుండి అభిప్రాయాలను కోరిన ఇంతకుముందు వారిలా కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, బౌలింగ్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా సహా జట్టులోని యంగ్ ప్లేయర్ల వరకు వారితో అన్ని విషయాలపై సమీకరణలు తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ విజయాన్ని సాధ్యం షా కూడా కీలక పాత్ర పోషించారని రోహిత్ గుర్తుచేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2020-2021లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో విజయవంతంగా నావిగేట్ చేశారు. ఐపీఎల్ సమయంలో బయో బబుల్‌ల సృష్టిని పర్యవేక్షించారు. ఆ బబుల్‌లలో వైద్య బృందాలతో సానుకూల కేసులను నిర్వహణ, టోర్నమెంట్‌లను విజయవంతంగా పూర్తి చేశారు.
అలాగే, విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడం జైషా అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. మహిళా క్రికెటర్లకు మంచి గుర్తింపుతో పాటు వారికి అర్థికంగా కూడా మరింత తోడ్పాటును అందించింది. అలాగే, జైషా కాలంలో ఈ సంవత్సరం 10-టెస్టుల సీజన్‌తో భారత మహిళల క్రికెట్ జట్టుకు సమాన మ్యాచ్ ఫీజులను అందించడంలో జైషా మర్క్ చూపించారు. రోహిత్, కోహ్లి, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు కోరినప్పుడు వారికి తగిన విరామం ఇవ్వడంలో కూడా షా ఆటగాళ్లతో నడుచుకునే విధానంపై ప్రశంసలు కురిశాయి.
- BCCI
- BCCI secretary
- Cricket
- Cricket news
- From district level to ICC chairmanship Jay Shah
- Gujarat Cricket Association
- ICC
- ICC chairman
- ICC chairman Jay Shah
- International Cricket Council
- JAY SHAH ICC
- JAY SHAH NEW ICC CHAIRMAN
- Jay Shah
- Jay Shah's journey
- india
- indian national cricket team
- indian team
- the youngest ICC chairman Jay Shah