టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా... ఇటీవల ఓ ఇంటివాడయ్యాడు. టీవీ ప్రజంటేటర్ సంజన గణేశన్ ని ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ తమ తమ విధులకు హాజరవ్వాల్సి వచ్చింది. సంజన.. టీవీ ప్రజంటేటర్ గా విధులు నిర్వహిస్తుండగా... బుమ్రా.. ఐపీఎల్ లో  బిజీగా ఉన్నాడు.

కాగా.. ఈ జంట ప్రస్తుతం ఆన్ లైన్ లో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. సంజన తాజాగా ఆఫీసులో ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దానికి బుమ్రా రిప్లై అభిమానులను ఆకట్టుకుంటోంది.

 

మంచి లైటింగ్ ఉంటే.. ఫోటోలు అద్భుతంగా వస్తాయి అంటూ సంజన తన ఫోటోకి క్యాప్షన్ ఇవ్వగా.. దానికి బుమ్రా.. రెండు హార్ట్ ఎమోజీలను రిప్లై గా ఇచ్చాడు.

బుమ్రా, సంజనలు ఈ ఏడాది మార్చి 15వ తేదీన పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి కోసం బుమ్రా.. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి కూడా దూరమయ్యాడు. కాగా.. ప్రస్తుతం బుమ్రా చెన్నైలో ఉన్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టుతో కలిసి ఐపీఎల్ కోసం తలపడుతున్నాడు. కాగా.. బుమ్రా, సంజనలు ఇటీవల సోషల్ మీడియాలో తమ మొదటి నెల పెళ్లి రోజును జరుపుకోవడం విశేషం.