Asianet News TeluguAsianet News Telugu

నాకు తెలిసి అది 24 గంటల వైరస్.. ఇంగ్లాండ్ ఆటగాళ్ల అస్వస్థతపై జో రూట్ కామెంట్స్

PAK vs ENG: పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో సుమారు 14 మంది అస్వస్థతకు గురయ్యారన్న విషయం ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేసింది.   దీంతో తొలి టెస్టు జరుగుతుందా..? లేదా..? అన్నది అనుమానంగా మారింది. 

Its Just a 24 Hours Virus: Joe Root Jokes on  England Cricket Team Members
Author
First Published Nov 30, 2022, 6:32 PM IST

17 ఏండ్ల తర్వాత  పాకిస్తాన్ లో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు లోని 14 మంది  క్రికెటర్లు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.  డిసెంబర్ 1 నుంచి రావాల్పిండి వేదికగా మొదలుకాబోయే ఈ టెస్టు జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానంగా మారింది.  ఒకరిద్దరు అంటే అంతగా చింతించాల్సిన పన్లేకున్నా ఏకంగా  14 మంది ఆటగాళ్లు అంతుచిక్కని వైరస్ బారిన పడటంతో ఇరు జట్ల క్రికెట్ బోర్డులు మ్యాచ్ జరపాలా..? వద్దా..? అనేది  చర్చిస్తున్నాయి.  అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్ల  అస్వస్థత గురించి  తాజాగా మాజీ సారథి  జో రూట్ కీలక అప్డేట్ ఇచ్చాడు. 

రావల్పిండి టెస్టుకు ముందు పాత్రికేయుల సమావేశానికి వచ్చిన రూట్.. ‘నాకు తెలిసినంతవరకూ టీమ్ లోని పలువురు ఆటగాళ్లు వంద శాతం ఫిట్ గా లేరు.   నేను కూడా  నిన్న (మంగళవారం) ఫిట్ గా లేను. కానీ ఇవాళ బాగానే ఉన్నా.  కావున  ఇది 24 గంటల వైరస్ అని నేను అనుకుంటున్నా. ఇది కోవిడ్ కాదు, ఫుడ్ పాయిజన్ అంతకన్నా కాదు..’ అని అన్నాడు. 

ఇంగ్లాండ్ టీమ్ లో ఆటగాళ్లు  వైరస్ బారిన పడటంతో  తుది జట్టులో ఎవరుంటారు..? అన్న విలేకరుల ప్రశ్నకు రూమ్ సమాధానం చెబుతూ.. ‘టాప్ -3లో  మార్కస్ ట్రెస్కోథిక్, బ్రెండన్ మెక్ కల్లమ్, రాబ్ కీ లు ఉన్నారు..’ అని ఫన్నీగా చెప్పాడు.   వీళ్లంతా ఇంగ్లాండ్ కోచింగ్ టీమ్ సభ్యులు కావడం గమనార్హం.ఇంగ్లీష్ క్రికెటర్లు ఇలా అస్వస్థతకు గురవడం ఇదే ప్రథమం కాదని.. గతంలో  తాము సౌతాఫ్రికా పర్యటనకు (2019-2020)  వెళ్లినప్పుడు కూడా ఇదే విధంగా జరిగిందని  రూట్ తెలిపాడు. 

 

ఇరు బోర్డుల చర్చలు.. 

ఇంగ్లాండ్ ఆటగాళ్లు  అస్వస్థతకు గురవడంతో  రావల్పిండి టెస్టు నిర్వహించాలా వద్దా..? అనేదానిమీద  ఇరు జట్ల క్రికెట్ బోర్డులు చర్చోపచర్చలు జరుపుతున్నాయి.  ఈ టెస్టును వాయిదా వేయడం మీద కూడా ఫోకస్ పెట్టాయి.   ప్రస్తుతానికైతే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పీసీబీ ఓ ట్వీట్ లో తెలిపింది. 

2005-06 తర్వాత మొట్టమొదటిసారి ఇంగ్లాంగ్ జట్టు, పాక్‌లో పర్యటిస్తోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం రావల్పిండి వేదికగా గురువారం ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇప్పటికే తొలి టెస్టు ఆడబోయే జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్...  రావల్పిండి టెస్టు ద్వారా టీ20 ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ టెస్టు ఆరంగ్రేటం చేయబోతున్నాడు.

తొలి టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ లీచ్, ఓల్లీ రాబిన్‌సన్, జేమ్స్ అండర్సన్

Follow Us:
Download App:
  • android
  • ios