ముంబయి జట్టు పోరాడి గెలిచింది. మంగళవారం చెన్నై వేదికగా కేకేఆర్ తో  జరిగిన మ్యాచ్ లో... ముంబయి ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా.. విజయం సాధించింది. రోహిత్ తన మాయాజాలంతో జట్టు విజయానికి సహకరించారు. ఈ విజయం పట్ల రోహిత్ మీడియాతో మాట్లాడాడు.

ఈ విజయం తమ జట్టులో రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చిందన్నాడు. దీన్నే రానున్న మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తామని రోహిత్‌ తెలిపాడు. టీమ్ ఎఫర్ట్ కారణంగానే విజయం సాధించామని చెప్పాడు. బౌలర్ల కారణంగానే గెలుపు సాధ్యమైందన్నాడు. ఇక బ్యాటర్స్‌గా తాము మంచి ప్రదర్శన చేయాల్సి ఉందన్నాడు. చెన్నైలో తొలి బంతి నుంచి హిట్‌ చేసే పరిస్థితులు ఉండటం లేదని, ఇది చెన్నైలోని చెపాక్‌లో ఒక ట్రెండ్‌లా కొనసాగుతోందన్నాడు.

ఇక్కడ బ్యాటింగ్‌కు క్రీజ్‌లోకి వచ్చే ముందే ఎలా ఆడాలనేది ప్లాన్‌ చేసుకుని రావాలన్నాడు. అలా కాకుండా మొదటి బంతి నుంచి హిట్టింగ్‌కు దిగితే మాత్రం సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదన్నాడు. తామింకా 15-20 పరుగులు చేయాల్సిందని, ఆఖరి ఓవర్లలో అనుకున్న పరుగులు రాలేదన్నాడు. డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ ఎలా చేయాలనే దానిపై కూడా ఫోకస్‌ చేస్తామన్నాడు.

ఇక ఇయాన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో ఓటమి నిరుత్సాహ పరిచింది. ఈ గేమ్‌ మొత్తం మీద చూస్తూ మాదే పైచేయిగా కనిపించింది. మేము ఈజీగా స్కోరును ఛేజ్‌ చేస్తామనిపించింది. కొన్ని తప్పులు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై చాలా స్ట్రాంగ్‌ టీమ్‌. వారు పుంజుకున్న తీరు అమోఘం. మేము కచ్చితమైన ఆటను ఆడలేకపోయాం. చివరి 10 ఓవర్లలో మ్యాచ్‌ మా చేతుల్లోంచి జారుపోతూ వచ్చింది. ఈ వికెట్‌పై సెకండ్‌ బ్యాటింగ్‌ చాలా కష్టంగా ఉంది. ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ గేమ్‌లో కూడా దాదాపు ఇలానే జరిగింది. కానీ ఏబీ ఎదురుదాడికి దిగడంతో ఆర్సీబీ గెలిచింది. మేము మంచి పొజిషన్‌లో ఉండి కూడా దాన్ని కడవరకూ తీసుకురాలేకపోయాం. ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు.