కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో 132 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీలు చేసిన సాయి సుదర్శన్, ఎన్ జగదీశన్... 

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, తన సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. డిసెంబర్ 10న బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండయా తరుపున డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్, రంజీ ట్రోఫీలోనూ సెంచరీతో కదం తొక్కాడు.. జార్ఖండ్ తరుపున ఆడుతున్న ఇషాన్ కిషన్.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో 195 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన అతి తక్కువ మంది లిస్టులో ఒకడిగా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...

అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా, వన్డేల్లో ద్విశతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులు క్రియేట్ చేసిన ఇషాన్ కిషన్... జార్ఖండ్ 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చాడు...

సౌరబ్ తివారితో కలిసి ఐదో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్.. జార్ఖండ్ స్కోరుని 320 దాటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 72, అక్షయ్ చంద్రన్ 150, సిజోమన్ 83, ప్రేమ్ 73 పరుగులు చేయడంతో 475 పరుగులకి ఆలౌట్ అయ్యింది కేరళ. కేరళ స్కోరుకి ఇంకా 150 పరుగులు వెనకబడి ఉంది జార్ఖండ్...

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్, ఎన్ సుదర్శన్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ 273 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 179 పరుగులు చేయగా ఎన్ జగదీశన్ 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 395 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అబిరథ్ రెడ్డి, రోహిత్ రాయుడు డకౌట్ అయినా కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 271 బంతుల్లో 16 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. మికిల్ జైస్వాల్ 193 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం...

పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్ 132 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పుదుచ్చేరి 37 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...

తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే ఆలౌట్ అయిన జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్ చేసిన 308 పరుగుల స్కోరును రెండో ఇన్నింగ్స్‌లోనూ అందుకోలేకపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బీహార్ ఇన్నింగ్స్ 221 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది...

అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో బీహార్ 517 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 305 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న బీహార్, రెండో ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ని 84 పరుగులకి ఆలౌట్ చేసేసింది.