విజయ్ హాజారే ట్రోఫీ ఆరంభంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్‌తో రికార్డులు క్రియేట్ చేశాడు యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన జార్ఖండ్‌కి కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత స్కోరుతో భారీ స్కోరు అందించాడు.

ఉత్కర్ష్ సింగ్ 6 పరుగులకే అవుట్ అయినా 94 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో 173 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్...45 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన కుమార్ కుషగ్రతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్‌, విరాట్ సింగ్‌తో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఎట్టకేలకు గౌరవ్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇషాన్. విరాట్ సింగ్ 49 బంతుల్లో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  36.4 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసిన జార్ఖండ్, భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు ఇషాన్ కిషన్.