సారాంశం

తొలి ఐదు వన్డేల్లో 348 పరుగులతో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా టెండూల్కర్‌ను కిషన్ అధిగమించాడు.  

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా, 90/0 పరుగులతో శుభారంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన టీమిండియా... 40.5 ఓవర్లకే ఓడిపోవడం గమనార్హం. అయితే, ఇషాన్ కిషన్ మాత్ర అదరగొట్టేశాడు.  రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి రాణించాడు ఇషాన్ కిషన్. అయితే రెండు వన్డేల్లోనూ శుభారంభం దక్కినా దాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యాడు. కానీ, అరుదైన ఘనతను మాత్రం సాధించాడు.

ఈ  యువ ఆటగాడు లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి భారీ మైలురాయిని సాధించాడు. తొలి ఐదు వన్డేల్లో 348 పరుగులతో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా టెండూల్కర్‌ను కిషన్ అధిగమించాడు.  ఇషాన్ కిషన్ తర్వాత  సచిన్ 321, శుభ్‌మన్ గిల్ (320), క్రిస్ శ్రీకాంత్ (261) ఉన్నారు. యువ ఆటగాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా బ్యాక్-టు-బ్యాక్ అర్ధసెంచరీలు చేసిన MS ధోని రికార్డును కూడా సమం చేశాడు - ఈ ఘనత 2017లో ధోనీ సాధించగా, ఇప్పుడు దానిని ఇషాన్ సమం చేయడం విశేషం.

నార్త్ సౌండ్‌లో జరిగిన మూడో వన్డేలో ధోనీ 79 బంతుల్లో 78 పరుగులు, నాలుగో వన్డేలో 114 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇప్పుడు అతని రికార్డును కిషన్ సమం చేశాడు. అదేవిధంగా  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా ఇషాన్ బద్దలు కొట్టాడు. ఐదు ఇన్నింగ్స్‌ల తర్వాత, ఓపెనర్‌గా బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగుల జాబితాలో కిషన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్‌గా సచిన్ తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేశాడు. ప్రస్తుతం కిషన్ 348 పరుగులు చేశాడు.


వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55), శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34) మధ్య 90 పరుగుల స్టాండ్ తర్వాత కేవలం 7.2 ఓవర్లలో 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడం భారత లక్ష్యాన్ని దెబ్బతీసింది.