భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) మోతెరా స్టేడియాన్ని నిర్మించింది. అతిపెద్ద స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య జరుగుతుందని తొలుత ప్రచారం జరిగింది. 

గుజరాత్ కి ట్రంప్ వచ్చి మొతేరా స్టేడియం ని ఓపెన్ చేయబోతున్నాడు అని తెలిసిన నాటి నుంచి మొదలు... క్రికెట్ అభిమానులంతా అక్కడ జరిగే తొలి మ్యాచ్ ఏమిటి, ఎప్పుడు అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో అత్యాధునిక సదుపాయాలు. సెంటర్‌ పిచ్‌. దాదాపుగా లక్షా పదివేవేల మంది ప్రేక్షకులు కూర్చోనే సామర్థ్యం,అన్ని హంగులతో అలరారుతున్న గ్రౌండ్..... ఇవి అహ్మదాబాద్‌ లో ఆధునీకరించిన మోతెర మైదానం విశేషాలు 

భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) మోతెరా స్టేడియాన్ని నిర్మించింది. అతిపెద్ద స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య జరుగుతుందని తొలుత ప్రచారం జరిగింది. 

తర్వాత ఐపీఎల్‌ ఆల్‌ స్టార్‌ మ్యాచ్‌, ఐపీఎల్‌ ఫైనల్స్‌ అంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ సమయానికి స్టేడియం అందుబాటులో వచ్చే అవకాశం లేదని, బీసీసీఐ వర్గాలు ఈ వార్తలను కొట్టిపారేశాయి. 

ఇక ఆ తరువాత ఏ మ్యాచ్ ఇక్కడ జరిగేది అంటూ చర్చ మళ్ళీ మొదలయ్యింది. తాజాగా విడుదల చేసిన ఐపీఎల్‌ షెడ్యూల్‌లో నాకౌట్‌ మ్యాచుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎందుకు ఆ ఒక్క విషయాన్నీ మాత్రం పక్కనపెట్టారు అని బలమైన చర్చ మాత్రం సాగుతుంది. 

ఈ చర్చలకు అన్నిటికి తెర దించుతూ గంగూలీ ఒక ట్వీట్ చేసాడు. మోతెరా స్టేడియం ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన గంగూలీ దానిపై ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. 

Scroll to load tweet…

ఇంత అందమైన గ్రౌండ్ లో తనకు ఆటగాడిగా, కెప్టెన్ గా ఎన్నో అనుభవాలు ఉన్నాయంటూనే మే 24 వరకూ ఎదురుచూడలేను.. అని గంగూలీ ట్వీట్‌ చేశాడు. మే 24న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. అంటే దానర్థం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొతేరాలో జరగనుందని గంగూలీ చెప్పకనే చెప్పాడు. 

దీంతో ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ మ్యాచ్‌ మోతెర స్టేడియంలో జరుగనుందని అధికారికంగా తేలిపోయింది. టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి సైతం మోతెర స్టేడియం ఫోటోను సోషల్‌ మీడియాతో పంచుకున్నాడు.