ప్రీతి జింటా జ‌ట్టులోకి రోహిత్ శర్మ.. పంజాబ్ కింగ్స్ వ్యూహం మాములుగా లేదు.. !

IPL 2025-Rohit Sharma : టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్, స్టార్ ప్టేయ‌ర్ రోహిత్ శర్మకు డిమాండ్ బాగా పెరిగింది. రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో పాటు ప్రీతి జింటాకు చెందిన పంజాబ్ కింగ్స్ రోహిత్ శర్మను ద‌క్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
 

Is Rohit Sharma joining Preity Zinta's team? Punjab Kings Super Strategy, Shock for Top Teams in IPL 2025 RMA

IPL 2025-Rohit Sharma : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ రాబోయే ఎడిష‌న్ (ఐపీఎల్ 2025) కోసం అన్ని జ‌ట్టు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఐపీఎల్ 2025 కి ముందు మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఉన్న జ‌ట్ల‌లో చాలా పెద్ద మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ ప్ర‌యాణం. హిట్ మ్యాన్ ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు.

టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన త‌ర్వాత రోహిత్ శ‌ర్మకు డిమాండ్ చాలా పెరిగింది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన త‌ర్వాత రోహిత్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో రోహిత్ క‌నిపించ‌క‌పోయినా.. అత‌న్ని ఈ ఫార్మాట్ లో ఐపీఎల్ లో చూడ‌వ‌చ్చు. ఐదు సార్లుముంబై ఇండియన్స్ ను ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన హిట్ మ్యాన్ ప్ర‌స్తుతం ముంబై లో ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. అత‌న్ని కెప్టెన్సీ నుంచి తొలగించ‌డం తీవ్ర వివాదం రేపిన సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ముంబైకి వీడ్కోలు చెప్పి మ‌రో జ‌ట్టులో భాగం కావాల‌ని చూస్తున్నాడు. 

అన్ని జ‌ట్ల చూపు రోహిత్ శ‌ర్మ పైనే.. 

Is Rohit Sharma joining Preity Zinta's team? Punjab Kings Super Strategy, Shock for Top Teams in IPL 2025 RMA

మెగా వేలానికి ముందే ముంబై ఇండియన్స్ రోహిత్ శ‌ర్మ‌ను విడిచిపెడితే వేలం వేయగానే చాలా ఫ్రాంచైజీలు హిట్ మ్యాన్ ను ద‌క్కించుకోవ‌డానికి ఉత్సాహం చూపుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో ప్రీతిజింటా టీమ్ పంజాబ్ కింగ్స్ కూడా చేరింది. పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ వేలంలో చేరితే, పంజాబ్ కింగ్స్ అతనిని ద‌క్కించుకోవ‌డానికి ఏమైనా ఎత్తుగడ వేస్తుందా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ సమాధానమిస్తూ.. రోహిత్ శర్మ వేలంలోకి ప్రవేశిస్తే అతనికి సహజంగానే భారీ బిడ్ వస్తుంద‌ని చెప్పాడు. కాబట్టి వేలంలో ఆ సమయంలో పంజాబ్ పర్సులో ఎంత డబ్బు ఉంటుందనే దానిపై అంతా ఆధారపడి ఉంటుందని చెప్పాడు. దాని కోసం ప్ర‌త్యేక వ్యూహాల‌ను సైతం సిద్ధం చేసిన‌ట్టు క్రికెట్ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ సాగుతోంది. 

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేదు. మెగా వేలంలో పటిష్టమైన జట్టును నిర్మించాలంటే జట్టుకు మంచి కెప్టెన్ కూడా అవసరం. కాబ‌ట్టి రోహిత్ శర్మ త‌మ జ‌ట్టును న‌డిపించే నాయ‌కునిగా పంజాబ్ కింగ్స్ చూస్తోంది. అతనిపై భారీ బిడ్డింగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధంగా ఉంటుంది. అయితే ఇదంతా ఈ ఐపీఎల్‌లో విడుదల-రిటైన్ గేమ్ త‌ర్వాత జ‌రిగే అంశం. ఆటగాళ్ల రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా ఏలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios