టీమిండియా: రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ముప్పు

రిషబ్ పంత్ కు కెఎల్ రాహుల్ రూపంలో ముప్పు పొంచి ఉంది. బ్యాటింగ్ లో దడదడలాడిస్తున్న కెఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అప్పగిస్తే ఎలా ఉంటుందనే చర్చ టీమిండియా విషయంలో ప్రారంభమైంది.

Is KL Rahul a readymade replacement for Rishabh Pant?

చెన్నై: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కు మరో ముప్పు పొంచి ఉంది. ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఎంఎస్ ధోనీ ఆడే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. అయితే, అది సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు.

ధోనీ స్థానంలో రిషబ్ పంత్ ను టీమ్ మేనేజ్ మెంట్ పరీక్షీస్తోంది. సంజూ శాంసన్ కు అవకాశం లేనట్లే. అయితే, రిషబ్ పంత్ గురించి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు సానుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ స్థానాన్ని కెఎల్ రాహుల్ భర్తీ చేసే అవకాశం ఉంది. దాంతో రిషబ్ పంత్ ను ఇంటికి పంపించే ఏర్పాట్లే జరుగుతాయి. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. వెస్టిండీస్ తో  జరిగిన టీ20 మ్యాచుల్లో కేఎల్ రాహుల్ ఆడిన తర్వా భళా అనిపించింది. దీంతో కేఎల్ రాహుల్ ప్రపంచ కప్ పోటీలకు ఎంపికయ్యే జట్టులో కచ్చితంగా స్థానం సంపాదించుకుంటాడని భావించవచ్చు.

కెఎల్ రాహుల్ కు వికెట్ కీపర్ గా అనుభవం ఉంది. టీ20ల్లో కర్ణాటక జట్టు తరఫున, ఐపిఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ లో విశేషంగా రాణిస్తున్న కెఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.  చెన్నైలో వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆ అవకాశంపై సానుకూలంగా మాట్లాడాడు.

ఈ స్థితిలో కెఎల్ రాహుల్ కు సాధ్యమైనంత త్వరగా వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇచ్చి పరీక్షిస్తే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అండర్ 19 జట్టులో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. 

ఒక్కసారి వికెట్ కీపర్ గా కెఎల్ రాహుల్ ను ఉపయోగించుకోవాలనుకుంటే మిడిల్ ఆర్డర్ ఓ స్లాట్ ఖాళీ అవుతుంది. ఆ స్థానంలో ధీటైన బ్యాట్స్ మన్ ను లేదా ఆల్ రౌండర్ ను ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా బీసీసీఐకి దక్కుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios