Virat Kohli: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఇప్పిటికే చాలా రికార్డులు నమోదయ్యాయి. అయితే ఆదివారం ఇందులో ఒక రికార్డును ఐర్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ పాల్ స్టిర్లింగ్ బద్దలుకొట్టాడు.
టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ సూపర్ ఇన్నింగ్స్ లు ఆడే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు మీద ఇప్పటికే పదుల సంఖ్యలో రికార్డులు నమోదయ్యాయి. అయితే టీ 20లో Virat kohli పేరిట నమోదైన అత్యధిక పోర్ల రికార్డును ఐర్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ Paul Stirling బద్దలుకొట్టాడు.
ICC T20 World Cupకు ముందు యూఏఈతో Ireland టీ20 మ్యాచ్ లు ఆడుతున్నది. కాగా, ఈ మ్యాచ్ లో స్టిర్లింగ్.. 35 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు టీ20 కెరీర్ లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టీ20 క్రికెట్ లో కోహ్లి ఇప్పటిదాకా 285 ఫోర్లు కొట్టగా.. పాల్ స్టిర్లింగ్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. 288 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలతో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో (252) ఉన్నాడు.
ఐర్లాండ్ తరఫున 89 టీ20 మ్యాచ్ లు ఆడిన స్టిర్లింగ్.. ఇప్పటివరకు 2,495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ‘UAE Summer T20 Bash 2021’లో భాగంగా ఐర్లాండ్, యూఏఈలు తలపడిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 16.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.
