Asianet News TeluguAsianet News Telugu

IPL2022 MI vs CSK: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... పోలార్డ్ లేకుండానే బరిలో...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... కిరన్ పోలార్డ్ లేకుండానే బరిలో ముంబై... ఇరుజట్లకీ కీలకంగా మారిన మ్యాచ్...

IPL2022 MI vs CSK: Mumbai Indians won the toss and elected to field against CSK
Author
India, First Published May 12, 2022, 7:11 PM IST

పీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సాంకేతిక కారణాలతో ఫ్లడ్‌లైట్స్‌ సమయానికి వెలగకపోవడంతో టాస్ 5 నిమిషాలు ఆలస్యమైంది. 

ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో యంగ్‌స్టర్ త్రిస్టన్ స్టుబ్స్ ఆరంగ్రేటం చేస్తున్నాడు. గాయపడిన తైమల్ మిల్స్ స్థానంలో త్రిస్టన్‌కి తుది జట్టులో చోటు దక్కింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ నుంచి ఈ సీజన్‌లో తిలక్ వర్మ, డేవాల్డ్ బ్రేవిస్, కుమార్ కార్తీకేయ, రమన్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్ వంటి ప్లేయర్లు ఆరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే... 

పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌లో ఉన్న ముంబై ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. ఐపీఎల్‌ చరిత్రలో 9 టైటిల్స్‌ని ఖాతాలో వేసుకున్న ఈ రెండు జట్లు తలబడితే ‘పైసా వసూల్’ వినోదం గ్యారెంటీ. 2022 సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్‌, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది...

ఆఖరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 16 పరుగులు కావాల్సి రాగా, ఎమ్మెస్ ధోనీ 6, 4, 2, 4 బాది మ్యాచ్‌ని ముగించి... ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్‌‌గా తన పేరును సార్థకం చేసుకున్నాడు... అయితే ఈసారి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌ ఇరుజట్లకీ చాలా కీలకంగా మారింది. 

ఇప్పటికే 11 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 9 పరాజయాలు చవిచూసింది... పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవకుండా ముగించాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది ముంబై ఇండియన్స్. 

4 పాయింట్లతో ఉన్న ముంబై, మిగిలిన మూడు గెలిస్తే 10 పాయింట్లతో బెటర్ పొజిషన్‌లో ముగించేందుకు అవకాశాలు ఉంటాయి...  మరోవైపు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కి కూడా ఈ మ్యాచ్ ఫలితం చాలా అవసరం. 11 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న సీఎస్‌కే, ప్లేఆఫ్స్‌ రేసులో ఆశలను ఇంకా సజీవంగానే నిలుపుకుంది...

సీఎస్‌కే మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే 14 పాయింట్లతో మిగిలిన జట్లతో పోటీ పడే అవకాశాలు ఉంటాయి. నేటి మ్యాచ్‌లో ఓడితే... ముంబై ఇండియన్స్ తర్వాత అధికారికంగా ప్లేాఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా నిలుస్తుంది చెన్నై సూపర్ కింగ్స్...

నేటి మ్యాచ్‌లో ఓడితే చెన్నై సూపర్ కింగ్స్, ఆఖరి స్థానంలో ముగించే ప్రమాదంలోనూ పడుతుంది. నేటి మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు మ్యాచుల్లో సీఎస్‌కే పరాజయం పాలై, ముంబై ఇండియన్స్ మిగిలిన మూడు మ్యాచులు గెలిస్తే... స్థానాలు తారుమారు అవుతాయి...

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మొయిన్ ఆలీ, శివమ్ దూబే, ఎమ్మెస్ ధోనీ, డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, త్రిస్టన్ స్టబ్స్, రమన్‌దీప్ సింగ్, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, జస్ప్రిత్ బుమ్రా, రిలే మెడరిత్

Follow Us:
Download App:
  • android
  • ios