ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు నికోలస్ పూరన్‌ని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... రూ.15 వేలు ఖర్చు పెట్టి టీమ్ మేట్స్‌తో పార్టీ చేసుకున్న పూరన్...
ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ఫారిన్ స్టార్ ప్లేయర్లలో నికోలస్ పూరన్ కూడా ఒకడు. ఈ వెస్టిండీస్ భారీ హిట్టర్, ఐపీఎల్‌లో మూడు సీజన్లు ఆడినా రెండంటే రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు... ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యంత చెత్త రికార్డును క్రియేట్ చేశాడు నికోలస్ పూరన్.గత సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు పూరన్...
మొదటి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన నికోలస్ పూరన్, ఆ తర్వాతి మ్యాచ్‌లో రెండో బంతికి డకౌట్ అయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతులేమీ ఎదుర్కోకుండానే సున్నాకే రనౌట్ అయ్యాడు...
ఒకే సీజన్‌లో డైమండ్ డకౌట్ (బంతులేమీ ఆడకుండానే డకౌట్), గోల్డెన్ డకౌట్, సిల్వర్ డకౌట్ అయిన ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు... వరుసగా ఫెయిల్ అవుతున్నా పూరన్‌కి 12 మ్యాచుల్లో అవకాశం ఇచ్చాడు అప్పటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్. పూరన్ నుంచి వచ్చిన పర్ఫామెన్స్ మాత్రం పూర్...
అలాంటి పూర్... రన్‌ని ఏకంగా రూ.10.75 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... వేలంలో రెండు సెట్లు ముగిసే వరకూ కనీసం ఏ ప్లేయర్ కోసం బిడ్ కూడా వేయని సన్‌రైజర్స్ హైదరాబాద్, మొదటి కోట్ మనీశ్ పాండే గురించే వేసింది... ఏ మాత్రం ప్రణాళిక, ప్లానింగ్, స్ట్రాటెజీ లేకుండా మరోసారి వేలానికి వచ్చిన ఆరెంజ్ ఆర్మీ, ఐపీఎల్ గత సీజన్లలో పేలవ ప్రదర్శన ఇచ్చినవారందరికీ ఏరీకోరీ కొనుగోలు చేసినట్టుగా అనిపించింది...
గత సీజన్‌లో 12 మ్యాచుల్లో 85 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ని రూ.10.75 కోట్లకు కొన్న ఆరెంజ్ ఆర్మీ, వాషింగ్టన్ సుందర్‌ను రూ.8.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది... ఇక్కడి వారికి పెద్దగా తెలియని విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ కోసం ఏకంగా రూ.7.75 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది...
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లానింగ్ ఎలా ఉన్నా, లక్కీగా లాటరీలో రూ.10.75 కోట్లు కొట్టేసిన ఆనందాన్ని తన టీమ్ మేట్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడట నికోలస్ పూరన్. ఏకంగా రూ.15 వేలు ఖర్చు పెట్టి మరీ తన టీమ్‌కి పార్టీ ఇచ్చాడట...
అసలే సంక్షోభంలో ఉన్న విండీస్ ప్లేయర్లు ఇంత మొత్తం ఖర్చు చేయడం అంటే అది పెద్ద విశేషమే. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు, వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే టీ20 సిరీస్‌లో మాత్రం టీమిండియాకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది...
కేన్ విలియంసన్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉండడంతో అతను అందుబాటులో లేని మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను నికోలస్ పూరన్‌కి అందించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సమాచారం...
