హాఫ్ సెంచరీలతో లక్నో సూపర్ జెయింట్స్‌ని ఆదుకున్న ఆయుష్ బదోనీ, దీపక్ హుడా... ఐదో వికెట్‌కి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి...
ఐపీఎల్ 2022 సీజన్ న్యూకమర్స్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్ ఆయూష్ బదోనీ అదిరిపోయే ఆరంగ్రేటం చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది...
ఇన్నింగ్స్ తొలి బంతికే లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్‌ని అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఊహించని షాక్ ఇచ్చాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు కెఎల్ రాహుల్. అంపైర్ తొలుత నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన గుజరాత్ టైటాన్స్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది...
9 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇవిన్ లూయిస్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన మనీశ్ పాండేని ఓ సూపర్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు షమీ. దీంతో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్.. యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనీ, దీపక్ హుడా కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి 63 పరుగులు మాత్రమే చేయగలిగింది లక్నో సూపర్ జెయింట్స్...
వరుణ్ ఆరోన్ వేసిన 13వ ఓవర్‌తో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టాడు దీపక్ హుడా. ఆ తర్వాతి ఓవర్2లో సిక్స్ కొట్టిన దీపక్ హుడా 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...
అప్పటివరకూ 22 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసిన ఆయుష్ బదోనీ... హార్ధిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో వరుసగా ఓ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు.
41 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన దీపక్ హుడా, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన గుజరాత్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది.
మహ్మద్ షమీ వేసిన 18వ ఓవర్‌లో కృనాల్ పాండ్యా రెండు ఫోర్లు బాదగా, ఆయుష్ బదోనీ ఓ ఫోర్ బాది 15 పరుగులు రాబట్టారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆయుష్ బదోనీ... 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి... వరుణ్ ఆరోన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు...
మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్‌కి ఓ వికెట్ దక్కింది. ఐపీఎల్‌లో రెండు సీజన్ల తర్వాత బౌలింగ్ చేసిన హార్ధిక్ పాండ్యా వికెట్ తీయలేకపోయాడు..
