IPL2022 MI vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మొదటి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్... 

ఐపీఎల్ 2022 భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలై, తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది...

మరో వైపు మూడింట్లో రెండు విజయాలు అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది. అయితే కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌కి మంచి రికార్డు ఉంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్, 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేతుల్లో నాలుగు మ్యాచుల్లో ఓడింది... గ్రూప్ స్టేజీతో పాటు మొదటి ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచుల్లో ఓడింది అయ్యర్ టీమ్...

తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు, సింగపూర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ స్థానంలో అండర్ 19 యంగ్ సెన్సేషన్ డివాల్డ్ బ్రేవిస్‌కి అవకాశం కల్పించింది. అలాగే మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు కూడా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. టిమ్ సౌథీ స్థానంలో ప్యాట్ కమ్మిన్స్ జట్టులోకి రాగా శివమ్ మావి స్థానంలో రషీక్ సలాం తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. 

ముంబై ఇండియన్స్ జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కిరన్ పోలార్డ్, డానియల్ సామ్స్, డేవాల్డ్ బ్రేవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, తైమల్ మిల్స్, బాసిల్ తంపి

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: అజింకా రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, ఉమేశ్ యాదవ్, రషీక్ సలాం, వరుణ్ చక్రవర్తి