IPL2022 GT vs RR Qualifier 1:  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌కి అడ్డంకిగా మారిన వరుణుడు...

IPL2022 GT vs RR Qualifier 1: ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మొదటి క్వాలిఫైయర్‌లో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలబడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, నేరుగా ఫైనల్‌కి దూసుకెళ్తుంది. ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంటుంది...

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. సీజన్‌లో 15వ మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 13వ సారి మ్యాచ్ ఓడిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సంజూ శాంసన్... 

ప్లేఆఫ్స్ మ్యాచులకు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం, క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌ రద్దయితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ పూర్తి చేయలేకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ రిజల్ట్‌ని డిసైడ్ చేస్తారు. అదీ కూడా సాధ్యం కాకపోతే 10 విజయాలతో టాప్‌లో ఉన్న కారణంగా గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరే ఛాన్స్ కొట్టేస్తుంది...

గుజరాత్ టైటాన్స్ గ్రూప్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా టాప్‌లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ 9 విజయాలతో టాప్ 2గా ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చింది. ఇరుజట్ల మధ్య లీగ్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్...

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు చేసింది... మాథ్యూ వేడ్ 12, శుబ్‌మన్ గిల్ 13 పరుగులకే అవుట్ అయినా శుబ్‌మన్ గిల్ 87, డేవిడ్ మిల్లయర్ 31, అభినవ్ మనోహర్ 43 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించారు. 

లక్ష్యఛేదనలో జోస్ బట్లర్ 24 బంతుల్లో 54 పరుగులు చేసినా అతను అవుట్ అవ్వగానే వరుస వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్, 155 పరుగులకి పరిమితమైంది... 

లీగ్ స్టేజీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో మాత్రమే పరాజయాలను ఎదుర్కొంది గుజరాత్ టైటాన్స్. వీటిలో ఆర్‌సీబీ తప్ప మిగిలిన మూడు జట్లు లీగ్ స్టేజీకే పరిమితమయ్యాయి. 

లీగ్ స్టేజీలో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో 7 సార్లు విజయాలు అందుకుంటే, ఛేజింగ్‌లో రెండు విజయాలు మాత్రమే అందుకోగలిగింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంటే, లక్ష్యఛేదనలో 6 విజయాలు అందుకుంది...

ఒకరి బలం మొదట బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోవడమైతే, మరోకరి బలం ప్రత్యర్థి ఇచ్చిన టార్గెట్‌ని ఛేదించడం... దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయికిషోర్, యష్ దయాల్, అల్జెరీ జోసఫ్, మహ్మద్ షమీ

రాజస్థాన్ రాయల్స్ జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాాల్, ఓబెడ్ మెక్‌కాయ్