IPL2021 KKR vs DC 2nd Qualifier: టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్... నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి సీఎస్‌కేతో ఫైనల్ ఆడే అవకాశం...
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... నేటి మ్యాచ్ గెలిచిన జట్టు, శుక్రవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది...
నేటి మ్యాచ్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరితే, ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టుకి రెండో ఫైనల్ అవుతుంది. అలాగే వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్ చేరిన జట్టుగానూ రికార్డు సృష్టిస్తుంది...అలాగే ఇప్పటికే రెండుసార్లు 2012, 2014లో టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫైనల్ చేరితే, వారికిది మూడో ఫైనల్ అవుతుంది. ఇంతకుముందు రెండుసార్లు ఫైనల్ చేరిన కేకేఆర్, రెండు సార్లూ టైటిల్ గెలిచింది...
ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్, సెకండాఫ్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. సెకండాఫ్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న కేకేఆర్, ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీని చిత్తు చేసింది...
కేకేఆర్ విజయోత్సాహంతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్వాలిఫైయర్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే...
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, లూకీ ఫర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, సునీల్ నరైన్, షకీబుల్ హసన్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సిమ్రన్ హెట్మయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా, ఆవేశ్ ఖాన్, స్టోయినిస్
