Asianet News TeluguAsianet News Telugu

ప్లేస్, డేట్ సెంటిమెంట్: రోహిత్ శర్మ టీమ్ కు కలిసిరాని ఐపిఎల్

సరి, బేసి సెంటిమెంట్లు, వరుస సంవత్సరాలు కప్పులు కొట్టలేకపోవడం వంటి సెంటిమెంట్లను పక్కనబెట్టినప్పటికీ... మరికొన్ని  కనబడుతున్నాయి. ఒక సారి ముంబై ఇండియన్స్ ను కలవరపెడుతున్న ఆ పరిస్థితులు ఏమిటో చూద్దాము. 

IPL2020 : These 3 Reasons Seem To Be Stumbling Blocks For The Defending Champions
Author
Mumbai, First Published Aug 27, 2020, 7:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా వైరస్ కారణంగా వాయిదాపడ్డ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో మనల్ని అలరించబోతుంది. దుబాయ్ లో జరుగుతున్నప్పటికీ... ఐపీఎల్ క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఒకపక్క ఫాన్స్ తమ అభిమానుల టీమ్స్ ఎలా పెర్ఫర్మ్ చేస్తాయని లెక్కలు వేసుకుంటుంటే... మరోపక్క బెట్టింగ్ రాయుళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. 

ఇక ఐపీఎల్ స్టార్ట్ అవుతుండడంతో ఒక్కో టీం బలాబలాలను పరిశీలిస్తుంటే... ముందుగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై మనసు మళ్లడం సహజం. ముంబై ఇండియన్స్ పరిస్థితిని చూస్తే.... ఈసారి వారు కప్పును నిలబెట్టుకోవడం కష్టంగా కనబడుతుంది. 

సరి, బేసి సెంటిమెంట్లు, వరుస సంవత్సరాలు కప్పులు కొట్టలేకపోవడం వంటి సెంటిమెంట్లను పక్కనబెట్టినప్పటికీ... మరికొన్ని  కనబడుతున్నాయి. ఒక సారి ముంబై ఇండియన్స్ ను కలవరపెడుతున్న ఆ పరిస్థితులు ఏమిటో చూద్దాము. 

ముందుగా ఆడుతున్న వేదిక గురించి మాట్లాడాల్సి ఉంటుంది. మ్యాచులు యూఏఈలో జరుగుతున్నాయి. ఏ టీం కి ఇది హోమ్ గ్రౌండ్ కానప్పటికీ... ఇక్కడి గ్రౌండ్లలో ముంబై ఇండియన్స్ కి పరమ చెత్త రికార్డు ఉంది. 

2014లో భారత్ లో ఎన్నికల కారణంగా ఐపీఎల్ లీగ్ మ్యాచులు యూఏఈలో జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు అక్కడ ఒక్కో టీం అయిదేసి మ్యాచులను ఆడింది. అన్ని టీములు 5 మ్యాచుల్లో కనీసం రెండేసి మ్యాచులను నెగ్గితే... ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచు కూడా గెలవలేదు. ఆడిన 5 మ్యాచుల్లో అన్నింటా ఓడింది. 

టోర్నమెంటులో చిన్నగా పుంజుకునే అలవాటు కలిగిన ముంబై ఇండియన్స్.... ఈ రికార్డుతో, ఆ గ్రౌండ్లలో ఎదురయ్యే పరిస్థితుల్లో ఎలా ఆడతారనేది వేచి చూడాల్సిన అంశం. 

మరో అంశం స్పిన్ విభాగం. ప్రతిటీంలోను కనీసం ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. చెన్నై కి ఇమ్రాన్ తాహిర్, పీయూష్ చావ్లా, జడేజా ఉంటె బెంగళూరుకు కూడా చాహల్, సుందర్, మొయిన్ అలీ వంటి స్పిన్నర్లు ఉన్నారు. కానీ ముంబై సైడ్ లో రెండవ క్వాలిటీ స్పిన్నర్ లోటు కనబడుతుంది. 

రాహుల్ చాహర్ ఒక్కడే వారికి ట్రంప్ కార్డు.రెండవ స్పిన్నర్ లేని లోటు ముంబైని కుదిపేస్తోంది. కరుణాళ్ పాండ్యా ఉన్నప్పటికీ... భారీ వికెట్ ఠాకూర్ మాత్రం కాదు. 55 మ్యాచుల్లో కరుణాళ్ ఇప్పటివరకు కేవలం నలభై వికెట్లను మాత్రమే తీసాడు. జయంత్ యాదవ్, అనుకూల్ రాయ్ లు ఉన్నప్పటికీ... వారు బ్యాక్ అప్ స్పిన్నర్లు మాత్రమే. ఇద్దరూ కలిపి కూడా 13 మ్యాచులనే ఆడారు. 

ఇక ముంబై కి ఉన్న మరో సమస్య కూడా బౌలింగ్ విభాగానిదే. కాకపోతే ఇది పేస్ బౌలింగ్ విషయంలో. బుమ్రా తప్పితే క్వాలిటీ పేసర్లు కనబడడంలేదు. మరో భారతీయ పేసర్ ధవళ్ కులకర్ణి ఉన్నప్పటికీ... లాస్ట్ మూడు సీజన్లలో కలిపి కేవలం 13 వికెట్లను మాత్రమే తీసాడు. 

ఇక విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే... లసిత్ మలింగా టోర్నీలో చాలా భాగం వరకు తన వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండబోతున్నట్టుగా తెలియవస్తుంది. బౌల్ట్ ను కొనుగోలు చేసినప్పటికీ... గత సీజన్లో బౌల్ట్ కేవలం 5 మ్యుఅచ్చులు మాత్రమే ఆడాడు. 

ఇక నాథన్ కౌల్టర్ నైల్ విషయానికి వస్తే... అతడు లాస్ట్ మ్యాచు ఆడింది 2017లో. ఇక మరో పేసర్ మెక్లి నగన్ విషయానికి వస్తే... ఆయన కివీస్ తరుఫున్నే టీంలోకి వచ్చి పోతున్న పరిస్థితి. 

హార్దిక్ పాండ్యా స్టైల్ అఫ్ బౌలింగ్ అక్కడ బ్యాట్స్ మెన్ కు చాలా కలిసి వస్తుంది. రూథర్ ఫోర్డ్, పోలార్డ్ వంటి క్రీడాకారులున్నప్పటికీ... వారు ఆస్థాయిలో బౌలింగ్ వేయలేరు. ప్రతి మ్యాచులో వీరి చేత నాలుగేసి ఓవర్లు వేయించలేరు. ఈ అన్ని పరిస్థితుల్లో ముంబై గనుక తొలిసారి కప్ గెలవాలంటే... బుమ్రా మరోసారి బూమ్ బూమ్ అనిపించడంతోపాటుగా... బ్యాట్స్ మెన్ విశేషంగా రాణించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios