మంగళవారం అబుదాబిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యర్‌కు మ్యాచ్ రిఫరీ ఫైన్ వేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో మరో కెప్టెన్‌కు జరిమానా పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్‌కు క్రమశిక్షణ నియమావళి ప్రకారం మ్యాచ్ రిఫరీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు సైతం జరిమానా విధించారు.
మంగళవారం అబుదాబిలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యర్‌కు మ్యాచ్ రిఫరీ ఫైన్ వేశాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శ్రేయస్ అయ్యర్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ మనూ నయ్యర్ నిర్ణయం తీసుకున్నారు.
విరాట్ కోహ్లికి సైతం రూ. 12 లక్షల జరిమానా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020లో స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్‌కు జరిమానా విధించటం ఇది రెండో సారి కావటం గమనార్హం.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీషా 2 పరుగులు చేసి అవుట్ కాగా... 21 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయ్యర్‌ను అవుట్ చేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే 31 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా అవుట్ అయ్యాడు.
రెండు భారీ సిక్సర్లు బాది 21 పరుగులు చేసిన హెట్మయర్‌ను భువనేశ్వర్ అవుట్ చేయగా... 27 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రిషబ్ పంత్ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. డేంజర్ మ్యాన్ స్టోయినిస్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ 2, ఖలీల్ అహ్మద్, నటరాజన్ చెరో వికెట్ తీశారు.
