Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ లో మరోసారి కరోనా కలకలం: మెడికల్ బోర్డు సభ్యుడికి పాజిటివ్

దుబాయిలో ఉన్న  బీసీసీఐ మెడికల్ బోర్డులోని ఒక సభ్యుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధృవీకరించాయి.

IPL2020 : Senior Medical team Member tests Positive For Coronavirus
Author
Dubai - United Arab Emirates, First Published Sep 3, 2020, 12:56 PM IST

ఐపీఎల్ ని కరోనా భయం ఇప్పుడప్పుడు వదిలేలా కనబడడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన 13 మంది కరోనా బారిన పది నాలుగు రోజులైనా గడవక ముందే... తాజాగా మరో కరోనా కేసు ఇప్పుడు ఐపీఎల్ శిబిరంలో కలకలం రేపుతోంది. 

దుబాయిలో ఉన్న  బీసీసీఐ మెడికల్ బోర్డులోని ఒక సభ్యుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధృవీకరించాయి. బెనగలూరు లోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో కూడా ఇద్దరు కరోనా వైరస్ బారినపడ్డట్టుగా తెలియవస్తుంది. 

కరోనా వైరస్ సోకినా మెడికల్ బోర్డు సభ్యుడికి ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతానికి ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే రౌండ్ టెస్టింగ్ నాటికి అతను కోలుకోవచ్చని తెలుస్తుంది. దుబాయ్ కి వచ్చే క్రమంలో ప్రాయంలో అతనెక్కడైనా కరోనా వైరస్ బారినపడి ఉండొచ్చని బోర్డు వర్గాలు అంటున్నాయి. 

ఇకపోతే... వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇప్పటికే సురేష్ రైనా దూరమవడం, దీపక్ చాహర్, రుతురాజ్ క్వాడ్ కార్టోన బారినపడడం,వీరితో పాటు కనీసం మరో 10 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడడంతో... టీంలో ఒకింత నిర్లిప్తత చోటు చేసుకుంది. 

క్రీడాకారులంతా ఇలా రూంలకే పరిమితమవడం, కరోనా బారినపడ్డ సహచరుల వల్ల భయాందోళలనలకు గురవుతున్న వేళ... టీం అందరికి కరోనా పరీక్షలు నిర్వహించింది జట్టు. ఈ ఫలితాలు ఇప్పుడు టీంలో కోలాహలం నింపాయి 

ఈ పరీక్షల్లో సిబ్బందితోసహా క్రీడాకారులందరికి కరోనా నెగటివ్ అని తేలింది. దీనితో నేడు మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షల్లో కూడా అందరికి నెగటివ్ వస్తే... 5వ తేదీ నుండి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.

రుతురాజ్, దీపక్ చాహర్ లు మాత్రం సెప్టెంబర్ 12వ తేదీ వరకు క్వారంటైన్ లోనే ఉండనున్నారు. వారి క్వారంటైన్ కాలం పూర్తయ్యాక మాత్రమే వారు జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటారు. 

లుంగీ ఎంగిడి, డూప్లెసిస్ దుబాయ్ చేరుకున్నారు. వారు నేరుగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇకపోతే... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంఛైజీలో 13 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. కోవిడ్‌19 బారిన పడిన 13 మందికి రోగ లక్షణాలు లేకపోవటం మరింత కలవరానికి గురి చేస్తోంది. సురక్షిత వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ బృందం యుఏఈలో అహర్నిషలు కృషి చేస్తోంది. 

సూపర్‌ కింగ్స్‌ ఘటనతో ఇతర ప్రాంఛైజీలకు బోర్డు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. క్వారంటైన్‌లో క్రికెటర్లను కచ్చితంగా హౌటల్‌ గదులకే పరిమితం చేసేలా సూచించింది.

సూపర్‌ కింగ్స్‌ పాజిటివ్‌ కేసులతో, ఇతర ప్రాంఛైజీల క్రికెటర్లు సైతం ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 19న జరుగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకారం) తలపడనున్న సంగతి తెలిసిందే!.

Follow Us:
Download App:
  • android
  • ios