కెఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌.. కర్నాటక రంజీ జట్టులో స్టార్‌ క్రికెటర్లు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆ రాష్ట్ర జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ను ఓడించేందుకు ఈ ఇద్దరు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రెఢీ  అవుతున్నారు. కెప్టెన్‌గా సీజన్‌లో తొలి విజయం కోసం కెఎల్‌ రాహుల్‌ ఎదురుచూస్తుండగా, తొలి మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌ బాదిన ఫామ్‌లో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌ సొంత నగర జట్టుపై సత్తా చాటాలని ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. 

నేడు దుబాయిలో బెంగళూర్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడనున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తన తొలి మ్యాచ్‌లో ఓడాల్సిన స్థితిలో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించగా.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నెగ్గాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ప్రత్యర్థి చేతుల్లో పెట్టింది. దీంతో నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.

ఎంత మంది స్టార్‌ క్రికెటర్లు జట్టులోకి వచ్చినా విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే అన్ని సీజన్లలో బ్యాటింగ్‌ భారం పడింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ చేయలేని పని యువ దేవదత్‌ పడిక్కల్‌ చేసి చూపించాడు. 

ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. టాప్‌ ఆర్డర్‌లో పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌ రాకతో రాయల్‌ చాలెంజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. 

విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌పైనే పూర్తిగా ఆధార పడాల్సిన అవసరం లేదనే దీమా ఆ జట్టులో కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ బెంగళూర్‌ జోరుమీదుంది. డెల్‌ స్టెయిన్‌, నవదీప్‌ సైని, యుజ్వెంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్‌లో తొలి బౌలర్ల కృషితోనే ఆర్‌సీబీ సులువుగా విజయాన్ని సొంతం చేసుకుంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ సులువుగా నెగ్గాల్సింది. ఆఖర్లో అలసత్వం, అంపైర్‌ తప్పిదం రెండూ పంజా బ్‌ను దెబ్బతీశాయి. ఆరంభ మ్యాచ్‌ విషాదాన్ని మరిచిపోయే విజయాన్ని నమోదు చేయాలనే కసి పంజాబ్‌ బృందంలో కనిపిస్తోంది. 

భీకర ఫామ్‌లో ఉన్న కెఎల్‌ రాహుల్‌ తొలి మ్యాచ్‌లో నిరాశపరి చాడు. సూపర్‌ ఓవర్‌ లోనూ రాహుల్‌ నిరుత్సా హపరిచాడు. సహచర కర్నాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ తోడుగా రెచ్చిపోయేం దుకు రాహుల్‌ సిద్ధంగా ఉన్నాడు. నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తొలి మ్యాచ్‌లో విఫల మయ్యారు. 

బెంగళూర్‌పై చెలరేగి లెక్క సరిచే యాలని చూస్తున్నారు. బౌలింగ్‌ విభా గంలో క్రిస్‌ జోర్డాన్‌పై పంజాబ్‌ వేటు వేసే అవకాశం కనిపి స్తోంది. ఆఖర్లో ధారాళంగా పరుగులు ఇచ్చిన జోర్డాన్‌.. ఓ కోణంలో పంజాబ్‌ ఓటమికి బాధ్యుడు. పేసర్‌ మహ్మద్‌ షమి శత్రు దుర్భేద్య అస్త్రాలతో సన్న ద్ధంగా ఉన్నాడు. అతడికి కృష్ణప్ప గౌతమ్‌, షెల్డన్‌ కాట్రెల్‌ సహకరిస్తే నేడు బెంగళూర బ్యాట్స్‌మెన్‌కు చుక్కలే!.