చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ డాషింగ్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)కు శాశ్వతంగా దూరం కానున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్  నుండి ఇప్పటికే రిటైరయిన ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ ఐపిఎల్ మాదిరిగానే వివిధ దేశాలు నిర్వహించే టీ20లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా ఇలా ఆడుతున్న లీగ్స్  కు గుడ్ బై చెప్పాడు వాట్సన్. 

సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోవడంతో ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచే వాట్సన్ కు ఐపిఎల్ లో చివరి మ్యాచ్ అయ్యింది. పంజాబ్ పై చెన్నై గెలుపు అనంతరం వాట్సన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా చెన్నై సహచరులకు వాట్సన్ తన నిర్ణయాన్నితెలియజేసి ఆ తర్వాత యాజమాన్యానికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. 

READ MORE  నేను లేకున్నా....: తన ఫ్యాన్స్ కు క్రిస్ గేల్ ప్రత్యేకమైన సందేశం

డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులకు తన నిర్ణయాన్ని తెలియజేసిన వాట్సన్‌ ఉద్వేగానికి గురయ్యాడట. చెన్నై ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని... ఈ జట్టు తనకెన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందంటూ భావోద్వేగానికి గురయినట్లు జట్టు వర్గాలు తెలిపాయి. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో చెన్నై కన్నా ముందు రాజస్తాన్‌ రాయల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వాట్సన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లోనే కాకుండా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్, పాకిస్తాన్‌ సూపర్‌లీగ్, బిగ్‌బాష్‌ లీగ్‌లలో కూడా వాట్సన్‌ బరిలోకి దిగాడు. ఇప్పుడు ఈ లీగ్ లకు కూడా ఆయన గుడ్ బై చెప్పాడు.