క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మరొక 13 రోజుల్లో ప్రారంభమవనుంది. బీసీసీఐ ఇందాక కొద్దిసేపటి కింద ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ని విడుదల చేసింది.  దుబాయ్,అబుదాబి, షార్జాలలో మ్యాచులు జరగనున్నాయి. 

అందరూ ఊహించినట్టే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య అబుదాబిలో జరగనుంది. 20వ తేదీ శనివారం నాడు దుబాయిలో తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ల మధ్య జరగనుంది. 

సోమవారం రోజు మూడవ మ్యాచ్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మంగళవారం నాడు షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. 

మొత్తంగా 10 డబల్ హెడర్ మ్యాచులు ఉన్నాయి. సాధారణంగా ప్రతి మ్యాచు రాత్రి 7.30కు ప్రారంభమవుతుంది. రెండు మ్యాచులు ఉన్న రోజు మొదటి మ్యాచు మధ్యాహ్నం 3.30కు ప్రారంభమవుతుంది. దుబాయ్ లో 24 మ్యాచులు జరగనుండగా, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచులు జరగనున్నాయి. 

ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న షెడ్యూల్ విడుదలవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ అభిమాన