KKR vs RR IPL 2025: ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ 95 పరుగులు సూపర్ నాక్ ఆడినా మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో కేకేఆర్ చేతిలో ఆర్ఆర్ ఓటమిపాలైంది.
KKR vs RR IPL 2025: ఐపీఎల్ 2025 53వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ స్టార్ రియాన్ పరాగ్ తన బ్యాటింగ్ సునామీ చూపించాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. అయితే, అతని అద్భుతమైన 95 పరుగుల ఇన్నింగ్స్ కు తోడుగా ఇతర ప్లేయర్లు రాణించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ చేతిలో ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రాజస్థాన్ కేవలం ఒక్క పరుగులు తేడాతో ఓడిపోయింది. చివరి బంతివరకు ఈ మ్యాచ్ ఉత్కంఠను కేపుతూ సాగింది.
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో వికెట్ కీపర్ గుర్బాజ్ 35 పరుగులు, కెప్టెన్ అజింక్య రహానే 30 పరుగులు, రఘువంశీ 44 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడారు. చివరలో ఆండ్రీ రస్సెల్ సునమీ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 6 సిక్సర్లు, 4 ఫోర్లతో కేవలం 25 బంతుల్లోనే 57 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో కేకేఆర్ 206 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం అందించాడు. 34 పరుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ నిరాశపరుస్తూ 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ వైపు తీసుకువచ్చాడు. వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది అద్భుతమైన నాక్ ఆడాడు.
95 పరుగుల తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అయితే, కీలక సమయంలో పరాగ్ అవుట్ కావడం రాజస్థాన్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టింది. చివరలో శుభందూబే గెలుపు కోసం ప్రయత్నించిన 25 పరుగుల ఇన్నింగ్స్ తో ఆర్ఆర్ కు విజయాన్ని అందించలేకపోయాడు.