IPL 2025 SRH vs RR Live Updates: ఐపీఎల్ 2025ని హైదరాబాద్ టీమ్ గెలుపుతో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
SRH 286/6 (20)
RR 242/6 (20)

IPL 2025 SRH vs RR Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)తో తలపడుతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్, సీనియర్ స్టార్ బౌలర్లతో హైదరాబాద్ టీమ్ ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తోంది. ఇదిలావుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సామ్సన్ వేలు గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించనున్నాడు.
గత సీజన్లో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లలో హైదరాబాద్ టీమ్ ఆధిపత్యం చెలాయించింది. కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌తో సహా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే, ఈ సారి ఏ జట్టు అధిపత్యం చూపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2025లో రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)-రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడుతున్నాయి, ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
IPL 2025 SRH vs RR Live Updates: ఐపీఎల్ 2025ని హైదరాబాద్ టీమ్ గెలుపుతో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
SRH 286/6 (20)
RR 242/6 (20)
IPL 2025 SRH vs RR Live Updates: రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకుని హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లు ఆడిన సంజూ శాంసన్ 66 పరుగులు, ధృవ్ జురేల్ 70 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.
రాజస్థాన్ 161-5 (14.2 ఓవర్లు)
IPL 2025 SRH vs RR Live Updates: సంజూ శాంసన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో 51 పరుగుల ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ధృవ్ జురేల్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
IPL 2025 SRH vs RR Live Updates: రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. మూడో వికెట్ ను కోల్పోయింది. షమీ బౌలింగ్ లో రాణా 11 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ 57-3 పరుగులు చేసింది.
IPL 2025 SRH vs RR Live Updates: భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్ లో యశస్వి జైస్వాల్ తో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ అవుట్ అయ్యారు. సిమర్జిత్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ లో జైస్వాల్ 1, పరాగ్ 4 పరుగుల వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యారు.
IPL 2025 SRH vs RR Live Updates: భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్ లో యశస్వి జైస్వాల్ తో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ అవుట్ అయ్యారు. సిమర్జిత్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ లో జైస్వాల్ 1, పరాగ్ 4 పరుగుల వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యారు.
IPL 2025 SRH vs RR Live Updates: ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, ట్రావిస్ హెడ్ సునామీ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 106*
ట్రావిస్ హెడ్ 67
నితీష్ కుమార్ రెడ్డి 30
అభిషేక్ శర్మ 24
హెన్రిచ్ క్లాసెన్ 34
IPL 2025 SRH vs RR Live Updates: హైదరాబాద్ చివరి ఓవర్ లో వరుసగా వికెట్లు కోల్పోయింది. దేశ్ పాండే వేసిన బౌలింగ్ లో అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ లు అవుట్ అయ్యారు.
IPL 2025 SRH vs RR Live Updates: ఐపీఎల్ లో తొలి సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్
హైదరాబాద్ టీమ్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ తన బ్యాట్ తో దుమ్మురేపాడు. తన ఐపీఎల్ కెరీర్ లో తన తొలి సెంచరీని సాధించాడు. 45 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో ఇషాన్ కిషన్ తన సెంచరీని పూర్తి చేశాడు. దీంతో హైదరాబాద్ టీమ్ 19 ఓవర్లలో 273-4 పరుగులు చేసింది.
IPL 2025 SRH vs RR Live Updates: 4వ సారి ఐపీఎల్ లో 250+ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్
18 ఓవర్లు పూర్తి కాకముందే హైదరాబాద్ టీమ్ స్కోర్ 250 పరుగులకు చేరింది. ఐపీఎల్ లో అన్ని జట్లు కలిపి 5 సార్లు 250+ స్కోర్లు సాధిస్తే ఇందులో హైదరాబాద్ ఒక్కటే నాలుగు సార్లు 250+ పరుగులు చేసింది. ప్రస్తుతం 18.2 ఓవర్లు పూర్తయిన తర్వాత ఎస్ఆర్హెచ్ 258-4 పరుగులతో ఆడుతోంది. క్లాసెన్ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
SRH vs RR హైలైట్స్ (12-16 ఓవర్లు) - 72 పరుగులు | 1 వికెట్
- ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ లేని ఓవర్ వేసిన తుషార్
- వరుసగా 25 బంతుల్లోనే ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ సాధించాడు
- 22 పరుగుల ఓవర్, ఆర్చర్ 3 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చాడు
- ఫరూకి తిరిగి వచ్చి ఒక ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు
- 15వ ఓవర్‌లో SRH 200 పరుగులు చేసింది
- తీక్షణకు రెండో వికెట్
IPL 2025 SRH vs RR Live Updates: హైదరాబాద్ టీమ్ పరుగుల వరద పారిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ విధ్వంసంతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన జట్టు 200 పరుగులు
14.1 ఓవర్లు - RCB vs PBKS, 2016
14.1 ఓవర్లు - SRH vs RR, 2025
14.4 ఓవర్లు - SRH vs MI, 2024
14.5 ఓవర్లు - SRH vs DC, 2024
IPL 2025 SRH vs RR Live Updates: హైదరాబాద్ టీమ్ 3వ వికెట్ కోల్పోయింది. 15 ఓవర్ లో నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
15 ఓవర్ల తర్వాత హైదరాబాద్ టీమ్: 208-3, ఇషాన్ కిషన్ 75* హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నారు.
IPL 2025 SRH vs RR Live Updates: ఇషాన్ కిషన్ 28 బంతుల్లో 59 పరుగుల ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. హైదరాబాద్ టీమ్ 178-2 (13 Ov)
IPL 2025 SRH vs RR Live Updates: ఓవర్ ది టాప్ లో బిగ్ షాట్ ఆడబోయి క్యాచ్ రూపంలో ట్రావిస్ హెడ్ 67 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. హైదరాబాద్ 130-2 (9.3 ఓవర్లు)
IPL 2025 SRH vs RR Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మంచి ఆరంభం లభించింది. ట్రావిస్ హెడ్ దూకుడు బ్యాటింగ్ తో హైదరాబాద్ టీమ్ భారీ స్కోర్ తో ముందుకు సాగుతోంది. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ రాజస్తాన్ బౌలింగ్ ను చిత్తు చేస్తున్నాడు.
హైదరాబాద్ టీమ్ 5 ఓవర్లు ముగిసే సరికి: 78/1 (5 ఓవర్లు)
ట్రావిస్ హెడ్ 41 (15)
ఇషాన్ కిషన్ 10 (5)
IPL 2025 SRH vs RR Live Updates: అభిషేక్ శర్మ ఔట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ అందుకుని అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. అభిషేక్ శర్మ 24(11) పరుగుల ఇన్నింగ్స్ లో 5ఫోర్లు బాదాడు.
హైదరాబాద్ టీమ్ 45/1 (3.1 ఓవర్లు)
IPL 2025 SRH vs RR Live Updates: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు మొదలుపెట్టింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊహించిన విధంగానే బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నారు. సన్‌రైజర్స్ రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. హెడ్ 8 బంతుల్లో 13 పరుగులతో నాటౌట్‌గా, అభిషేక్ 5 బంతుల్లో 9 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: సంజు శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్లు: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్
IPL 2025 SRH vs RR Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేయింగ్ 11
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ