ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ 12 లో జరిగిన మ్యాచులన్ని రాత్రి ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. శని, ఆదివారం మద్యాహ్నం జరిగిన మ్యాచులను  మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచులు ఇప్పటివరకు రాత్రి 8 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే ఈ లీగ్ మ్యాచులు ముగిసిన తర్వాత జరగనున్న అన్ని మ్యాచుల టైమింగ్ లో మార్పులు చేపట్టనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు  ఆయా మ్యాచులకు సంబంధించిన వివరాలను ఐపిఎల్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చారు.

ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బిసిసిఐ తాజాగా టైమింగ్స్ ను కూడా మార్చింది. సాధారణంగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచులు ప్లేఆఫ్ నుండి 7.30 గంటలకే ప్రారంభం కానున్నట్లు బిసిసిఐ తెలిపింది. ఇలా అరగంట ముందుగానే మ్యాచ్ లు ప్రారంంభం కానున్నాయని తెలిపింది. ఐపిఎల్ ప్రేక్షకులందరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. 

చెన్నై చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్-1, విశాఖ పట్నంలో క్వాలిఫర్-2, ఎలిమినేషన్, హైదరాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నాలుగు మ్యాచులు కూడా అరగంట ముందుగానే ప్రారంభంకానున్నాయి. మే 7వ తేదీన చెన్నైలో, మే 8,10 తేదీల్లో విశాఖలో, మే12ను హైదరాబాద్ లో ఈ  మ్యాచులు జరగనున్నాయి.