IPL ఛాంపియ‌న్ కేకేఆర్‌కు కొత్త మెంట‌ర్ - గంభీర్ లోటును బ్రావో పూడుస్తాడా? KKR ప్లానేంటి?

IPL 2025 - KKR - Bravo : వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంత‌ర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల‌కురిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఇదే క్ర‌మంలో అత‌ను గౌతమ్ గంభీర్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్‌గా చేరాడు. ఐపీఎల్ ఛాంపియ‌న్ టీమ్ కేకేఆర్ బ్రావో తో ఏం మాస్ట‌ర్ ప్లాన్ వేసింది? 
 

IPL Champions KKR's New Mentor - Will Dwayne Bravo Fill Gautam Gambhir's Gap? What is KKR's plan? RMA

IPL 2025 - KKR - Bravo : వెస్టిండీస్ గ‌ర్వించ‌ద‌గ్గ క్రికెట‌ర్ల‌లో డ్వేన్ బ్రావో పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ లో వెస్టిండీస్ కు అనేక సార్లు అద్భుత‌మైన విజ‌యాలు అందించాడు. ప్ర‌పంచంలోని చాలా క్రికెట్ లీగ్ ల‌లో త‌న స‌త్తా ఏంటో చూపించాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాలైన గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ వంటి దిగ్గ‌జాల స‌ర‌స‌న చేర‌క‌పోయినా.. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన లైవ్‌వైర్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే, క్రికెట్ అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత బ్రావో ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం బ్రావోను  మెంటార్‌గా తీసుకుంది.

గంభీర్ స్థానంలో డ్వేన్ బ్రావో కేకేఆర్ మెంట‌ర్ గా ఎందుకు తీసుకుంది?  

ఐపీఎల్ 2024 లో కేకేఆర్ మెంట‌ర్ గా భార‌త స్టార్ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఉన్నారు. అత‌ని సార‌థ్యంలో కేకేఆర్ అద్భుత‌మైన ప్ర‌యాణంతో ఐపీఎల్ 2024 లో ఛాంపియ‌న్ గా నిలిచింది. అయితే, గౌత‌మ్ గంభీర్ భారత జట్టు ప్ర‌ధాన కోచ్ గా మార‌డంతో అత‌ని స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి కేకేఆర్ గ‌త కొంత కాలంగా జ‌ట్టుకు అనువైన వ్య‌క్తికోసం వెతుకుతోంది. ఈ క్ర‌మంలోనే గంభీర్ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రావో ను తీసుకుంది. తన కెరీర్‌లో బ్రావో 582 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 631 వికెట్లు తీసుకున్నాడు. దాదాపు 7,000 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో కూడా ప‌లు జ‌ట్ల త‌ర‌ఫున బ్రావో ఆడాడు. మూడు వేర్వేరు ఐపీఎల్ సీజన్లలో బ్రావో 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి ఐపీఎల్ లో స‌రికొత్త రికార్డు సాధించాడు. కాబట్టి టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో బ్రావో అనుభవం, నైపుణ్యం అసమానమైనది. అందుకే ఇప్పుడు కేకేఆర్ బ్రావో ను మెంట‌ర్ గా తీసుకుంది. 

డ్వేన్ బ్రావో అంత‌ర్జాతీయ క్రికెట్ లో అద్భుత‌మైన ప్లేయ‌ర్ గా త‌న కెరీర్ ను కొన‌సాగించాడు. బ్రావో నిజమైన విలువ అతని బహుముఖ ప్రజ్ఞలో ఉంది. గేమ్ లో క్లిష్ట స‌మ‌యంలోనూ వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట‌. అత‌ను ప్రతి పనిని ఉన్నత స్థాయి సామర్థ్యంతో పూర్తి చేయ‌డం చాలా సార్లు క్రికెట్ ప్ర‌పంచం చూసింది. సీపీఎల్ లో నైట్ రైడర్స్ భాగంగా కూడా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ సభ్యుడు కూడా. వివిధ లీగ్‌లలో నైట్ రైడర్స్ తరపున, అలాగే, వ్యతిరేకంగా ఆడిన అతనికి ఫ్రాంచైజీ తన కార్యకలాపాలను నిర్వహించే విధానం గురించి చాలా అవగాహన ఉంది.

రిటైర్మెంట్-ప్ర‌స్తుత ఐపీఎల్ ప్ర‌యాణం గురించి బ్రావో ఏం చెప్పాడు? 

IPL Champions KKR's New Mentor - Will Dwayne Bravo Fill Gautam Gambhir's Gap? What is KKR's plan? RMA

తన జీవితంలో కొత్త అధ్యాయం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాన‌ని బ్రావో మాట‌ల్లో తెలిసింది. అతను మీడియాతో మాట్లాడుతూ.. “యజమానుల అభిరుచి, మేనేజ్‌మెంట్ - వృత్తి నైపుణ్యం - కుటుంబ-వంటి వాతావరణం కేకేఆర్ ను ప్ర‌త్యేక స్థానంలో నిలుపుతాయి. నేను ఆడటం నుండి తదుపరి తరం ఆటగాళ్లకు మెంటరింగ్, కోచింగ్ విభాగంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఇది నాకు స‌రైన వేదిక‌గా అనిపించింది" అని తెలిపాడు. అలాగే, "ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఇరవై ఒక్క సంవత్సరాలు - ఇది చాలా ఎత్తులు-కొన్ని అణచివేతలతో నిండిన అద్భుతమైన ప్రయాణం. మరీ ముఖ్యంగా, నేను మీకు అడుగడుగునా 100 శాతం అందించినందున నేను నా వాస్త‌వ కలలో అద్భుత ప్ర‌యాణం చేశాడు" అని తెలిపాడు. 

ఐపీఎల్ లో బ్రావో అద్బుత‌మైన ప్ర‌యాణం-దాదాపు అన్ని జ‌ట్ల‌పై ప‌ట్టు

బ్రావో ఐపీఎల్ లో అద్భుత‌మైన ప్ర‌యాణం సాగించాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ త‌ర‌ఫున ఆడాడు. ఈ వెస్టిండీస్ ఆల్-రౌండర్ వివిధ పాత్రలలో చెన్నై టీమ్ తో చేసిన ప్ర‌యాణంలో నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు. ఐపీఎల్ లో 1560 ప‌రుగులు చేయ‌గా, ఇందులో 5 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. బౌలింగ్ విష‌యానికి వ‌స్తే 183 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్యుత్త‌మ బౌలింగ్ రికార్డులు 4/22 వికెట్లు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ బ్రావో. ఐపీఎల్ 2013, 2015 ఎడిష‌న్ల‌తో రెండు పర్పుల్ క్యాప్‌లను గెలుచుకున్న మొదటి క్రికెట‌ర్ బ్రావో.

ఐపీఎల్ లోనే కాకుండా బంగ్లాదేశ్ లీగ్ లో లో చిట్టగాంగ్ కింగ్స్, కొమిల్లా విక్టోరియన్స్, ఢాకా డైనమైట్స్, ఫార్చూన్ బరిషాల్ కోసం ఆడాడు. ఇంగ్లాండ్ క్రికెట్ లీగ్ లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్, ఎసెక్స్, మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్, కెంట్ కోసం ఆడాడు. అలాగే, లాహోర్ క్వాలండర్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ కోసం కూడా ఆడాడు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ రెనెగేడ్స్, మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్ల జ‌ట్ల త‌ర‌ఫున కూడా బ్రావో ఆడాడు. దక్షిణాఫ్రికాలో డాల్ఫిన్స్, పార్ల్ రాక్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జ‌ట్ల త‌ర‌ఫున కూడా ఆడాడు. 

IPL Champions KKR's New Mentor - Will Dwayne Bravo Fill Gautam Gambhir's Gap? What is KKR's plan? RMA

డ్వేన్ బ్రావో టీ20 ఫార్మాట్‌లో ఏడు ప్రపంచ కప్‌లలో ఆడాడు. వాటిలో రెండింటిలో విజ‌యం సాధించి ఛాంపియ‌న్ గా నిల‌వ‌డంతో టీ20 క్రికెట్ లెజెండ్‌లలో ఒకరిగా స్థానం సంపాదించాడు. అలాగే, త‌న కెరీర్ లో 15 ఫ్రాంచైజీ లీగ్ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో మొత్తం 500 వికెట్లు సాధించిన మొదటి బౌలర్ బ్రావో. తన క్రికెట్ కెరీర్ ప్రారంభించినప్పుడు టీ20 క్రికెట్ లేదు. దీంతో త‌న ప్రాంతానికే చెందిన మ‌రో లెజెండ్, తన ఆరాధ్యుడు బ్రియాన్ లారా మాదిరిగా మార‌ల‌ని అనుకున్నాడు. అయితే, బ్రావో 20 ఫార్మాట్‌లో ఆడటం మొద‌లుపెట్టిన‌ప్పుడు చాలా త్వ‌ర‌గా ఆట‌ను అర్థం చేసుకుని ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ప్ర‌మాద‌క‌ర‌మైన బౌల‌ర్ గా మారాడు. ప్ర‌పంచవ్యాప్తంగా చాలా జ‌ట్లు అత‌న్ని కోరుకునే విధమైన టీ20 ప్లేయ‌ర్ గా కెరీర్ కొన‌సాగించాడు. 

క్లిష్ట‌స‌మ‌యంలోనూ వ్యూహాలు ర‌చించ‌డంలో బ్రావో దిట్ట 

కీలకమైన చివరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించడానికి బ్రావో వ్యూహాలు అద్భుతంగా ఉంటాయి. ఇది చాలా తక్కువ మంది బౌలర్లలో క‌నిపించే నైపుణ్యం. అత్యంత వేగం లేక‌పోయినా అత‌ని బంతుల‌ను ఆడ‌టానికి బ్యాట‌ర్లు క‌ష్ట‌ప‌డే విధంగా బౌలింగ్ చేయ‌డం బ్రావో ప్ర‌త్యేక‌త‌. స్లోయర్ బంతులు వేస్తూనే త‌న బౌలింగ్ ట్రిక్స్‌తో బ్యాట‌ర్ల‌ను దెబ్బ‌కొట్టేవాడు. ఒత్తిడిలో కూడా కూల్ గా ఆడే గొప్ప ప్లేయ‌ర్ బ్రావో. పరిస్థితిని చాలా చాకచక్యంగా విశ్లేషించడం, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తన వ్యూహాలను రూపొందించే స్టైల్, పిచ్ స్థితి, ఆట‌గాళ్లను అంచ‌నా వేయ‌డంలో అత‌ని నైపుణ్యాల కార‌ణంగానే కేకేఆర్ బ్రావోను త‌న మెంట‌ర్ గా తీసుకుంది. రాబోయే సీజ‌న్ లోనూ ఛాంపియ‌న్ గా నిలవాల‌నే వ్యూహాల‌ను బ్రావో తో క‌లిసి ఇప్ప‌టినుంచే ర‌చిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios