చెన్నై: తెలుగు క్రికెటర్ హనుమ విహారిరకి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను కొనడానికి ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపపలేదు. ఐపీఎల్ మినీ వేలం గురువారం సాయంత్రం 3 గంటలకు చెన్నైలో ప్రారంభమైన విషయ తెలిసిందే. 

అలాగే ఇండియన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ను కొనడానికి కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. జాసన్ రాయ్ కూడా అమ్ముడు పోలేదు. వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ ను కూడా కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచేజీ కూడా ముందుకు రాలేదు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ది కూడా అదే పరిస్థితి.

ఇంగ్లాండు ఆటగాడు అలెక్స్ హేల్స్ ను కొనుగోలు చేయడానికి కూడా ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ పేరు వేలంలో తొలుత వచ్చింది. అతని బేస్ ప్రైస్ రూ.50 లక్షలు. అయితే, అతన్ని కూడా ఏ ఫ్రాంచేజీ కొనుగోలు చేయలేదు. 

ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్వాగతోపన్యాసం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జె. షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ దుమాల్ హాజరయ్యారు. ఐపిఎల్ ప్రకటనదారులకు, భాగస్వాములకు బ్రిజేష్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు.