న్యూఢిల్లీ: కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు సభ్యులను ఎంచుకున్న తీరుపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గాయపడితే బ్యాకప్ ఆప్షన్లు లేవని, బ్యాక్ అప్ ఆప్షన్లు చూసుకోకుండా జట్టు సభ్యులను ఎంపిక చేసుకున్నారని ఆయన అన్నారు. 

రూ.15.5 కోట్ల భారీ ధర పెట్టి కేకేఆర్ పాట్ కమిన్స్ ను కొనుగోలు చేసుకుంది. అదే విధంగా రూ.5.25 కోట్లు పెట్టి ఇంగ్లాండు ప్రపంచ కప్  గెలిచిన జట్టుకు నాయకత్వం వహించిన ఇయాన్ మోర్గాన్ ను తీసుకుంది. ఈ ఇద్దరి కోసం పెద్ద యెత్తున కేకేఆర్ ఫ్రాంచైజీ పెట్టుబడి పెట్టింది.

Also Read: IPL Auction: జాక్ పాట్ కొట్టేసిన భారత కుర్రాళ్ళు వీరే!

కొత్త బంతితో మంచి స్వింగ్, పేస్ తో బౌలింగ్ చేయగలడని, అది కమిన్స్ విషయంలో సానుకూలాంశమని, డెత్ ఓవర్ల విషయంలో కమిన్స్ రాణించలేడని, అయితే అతను మంచి బౌలర్ అని గంభీర్ అన్నాడు. 2014లో కేకేఆర్ తరఫున ఆడినప్పటి నుంచి కమిన్స్ మెరుగయ్యాడని ఆయన అన్నాడు. 

ఎంతో పెద్ద మొత్తం పెట్టి కొన్నారు కాబట్టి కమిన్స్ మూడు నాలుగు మ్యాచులను ఒంటి చేతితో గెలిపించగలడని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు. కానీ జట్టు మొత్తాన్ని కలిపి చూస్తే ఆండ్రే రసెల్, ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్ ల కు బ్యాకప్ ఆప్షన్ లేదని, ఇయాన్ మోర్గాన్ గాయపడితే మిడిల్ ఆర్డర్ లో ఆడే విదేశీ ఆటగాడు లేడని అన్నాడు.

Also Read: కీలక నిర్ణయం తీసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

జట్టుకు డెప్త్ ఇవ్వడానికి మిచెల్ మార్ష్ ను గానీ మార్కుస్ స్టోయినిస్ ను గానీ తీసుకోవాల్సింది గంభీర్ అన్నాడు. పాట్ కమిన్స్ గాయపడితే అతని స్థానాన్ని భర్తీ చేయడానికి లకీ ఫెర్గూసన్ ఉన్నాడని, టాప్ ఆర్డర్ విషయానికి వస్తే భర్తీ చేయడానికి ఆటగాళ్లు లేరని అన్నాడు.