ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా టీం ఇండియా ఓపెనర్ కె ఎల్ రాహుల్ ని ఎంపిక చేసినట్టు టీం యాజమాన్యం ప్రకటించింది. 

"రాబోయే సీజన్‌కు రాహుల్‌ను మా కెప్టెన్‌గా నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతను గత సంవత్సర కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. వాటన్నిటి నుంచి బయటపడి ఇప్పుడు మరింత బలంగా తిరిగి వచ్చాడు" అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం కో ఓనర్ నెస్ వాడియా అన్నారు. 

తన విమర్శకుల నోళ్లను మూయించాడని,అతను వారి విమర్శలన్నింటికీ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడని నెస్ వాడియా అన్నాడు. ఇప్పటివరకు అతని సామర్థ్యాన్ని బ్యాట్స్ మాన్ గానే చూసారని.... ఇకమీదట కెప్టెన్ గా కూడా చూస్తారని, రాహుల్ ఎంపిక ఏకగ్రీవమైన నిర్ణయమని వాడియా అన్నాడు. 

KXIP రాహుల్‌ను 2018 సీజన్‌కు ముందు 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

రవిచంద్రన్ అశ్విన్ ను గత నెలలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ట్రేడ్ ఆఫ్ చేసిన తరువాత రాహుల్ కెప్టెన్ అవుతాడు అని అందరూ ఊహించినట్టే రాహుల్ కెప్టెన్ అయ్యాడు. 

ఇక నిన్నటి వేలం తరువాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మరింత ధృడంగా, బలంచెద్ గా కనపడుతుంది. ఒక సారి ఆ టీం ని గనుక చూస్తే ఆ విషయం మనకు యిట్టె అర్థం అయిపోతుంది. 

కింగ్స్ XI పుంజాబ్ స్క్వాడ్:

క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ సింగ్, షెల్డన్ కాట్రెల్, ఇషాన్ పోరెల్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్ష్‌దీప్ సింగ్, హర్దస్ విల్జోయెన్, ఎం అశ్విన్, జె సుచిత్, హర్ప్రీన్ నార్డ్ మాక్స్వెల్, జేమ్స్ నీషామ్, క్రిస్ జోర్డాన్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, తాజిందర్ సింగ్ ధిల్లాన్, కెఎల్ రాహుల్ (సి), నికోలస్ పూరన్, ప్రభాసిమ్రాన్ సింగ్.