IPL 2024: పాపం.. ధోని దెబ్బకు చెవులు మూసుకున్న రస్సెల్.. వీడియో చూశారా?
IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది.
IPL 2024: మహేంద్ర సింగ్ ధోని..తన ధనాధన్ ఆటతీరుతో, మాస్టర్ ప్లాన్ కెప్టెన్సీ లక్షణాలతో కోట్లాదిమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఇక ధోని ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతాయి. ధోని తన సారధ్యంలోనే టీమిండియాకు వన్డే, t20 ప్రపంచ కప్ లను సాధించి విశ్వవిజేతగా చరిత్రలో నిలిపారు. అలాగే..ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లోనూ తాను ప్రాతినిధ్య వహించే చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.
మహికీ తన సొంత రాష్ట్రం జార్ఖండ్ అయినా.. తన రెండో ఇల్లు చెన్నై అనేలా మారారు. ఇలా ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టు తరుపున ఆడుతున్న మహి కోట్లాదిమంది సీఎస్కే ఫ్యాన్స్ కు ఆరాధ్య దైవంగా మారాడు. ఇక ఐపీఎల్ సీజన్ ముందు తన సారధ్యం వహిస్తున్న చెన్నై బాధ్యతలను సైతం వదిలేశాడు ఎంఎస్ ధోని ఈ సారి కేవలం ప్లేయర్ గానే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోనికి ఇదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు.
నిన్న సోమవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లోనూ ఇదే జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి కేకేఆర్ తక్కువ స్కోర్ చేయడంతో తర్వత బ్యాటింగ్ వచ్చిన చెన్నై అలవోకగా లక్ష్యాన్ని చేధించింది. ఈ తరుణంలో తమ అభిమాన ప్లేయర్ మహి బ్యాటింగ్ చూడలేకపోయామా అని ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. మరో మూడు పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఈ దశలో శివమ్ దూబే మూడో వికెట్ గా వెనుదిగారు. ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోని ఏంట్రీ ఇచ్చారు. ఎప్పుడు ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే మహి.. మూడు వికెట్ల పడ్డాక వెంటనే వచ్చాడు.
మహి రావడాన్ని చూసిన ధోని ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది. అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది. ధోనీ.. ధోనీ.. అంటూ ప్రేక్షకులు పెద్దెత్తున నినాదాలు చేశారు. ధోని అడుగుపెట్టిన అప్పటినుంచి మ్యాచ్ ముగిసే వరకు అదే జోష్ కొనసాగించారు. ఈ క్రమంలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శబ్దం స్థాయి 125 డెసిబుల్స్ కు చేరుకుంది. నిజంగా బౌండరీ దగ్గర ఫిల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు భరించలేకపోయారు. ఈ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫిల్డింగ్ చేసిన కేకేఆర్ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఆండ్రీ రస్సెల్ చెవులు మూసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.