IPL 2024: వరల్డ్ కప్ హీరోను టార్గెట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్..
Chennai Super Kings: ఐపీఎల్ 2024 మినీ వేలంలో పాలుపంచుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.31.4 కోట్ల మనీ పర్సు ఉంది. ఈ వేలంలో చెన్నై టీం శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, జోష్ హేజిల్ వుడ్ లతో పాటు వరల్డ్ కప్ లో సత్తాచాటిన ప్లేయర్లపై కన్నేసింది.
IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో జరగనుంది. 10 ఐపీఎల్ జట్లు తమ పరిమిత పర్సుతో అత్యుత్తమ ఆటగాళ్లను పొందడానికి ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నాయి. టీంలు ప్రతిభావంతులైన భారతీయ ప్లేయర్ల పై ఎక్కువ దృష్టి సారించినట్టు సమాచారం. తమ వద్ద ఉన్న మనీ పర్సుతో అత్యుత్తమమైన జట్టును ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సత్తా చాటాలని చూస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మనీ పర్సులో రూ.31.4 కోట్లు ఉన్నాయి. వెటరన్ ప్లేయర్ అంబటి రాయుడు స్థానంలో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ ను జట్టులోకి తీసుకోవాలని చూస్తున్న ఆ జట్టు, మనీష్ పాండే ఆ స్థానానికి సరిపోతాడని భావిస్తోంది. అయితే, చెన్నై టార్గెట్ లిస్ట్ లో శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతకుముందు అతను చెన్నై టీంకు ఆడాడు. వేలానికి ముందే టీం నుంచి విడుదలయ్యాడు, కానీ, అతని ఇటీవల చేసిన ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకునీ, సీఎస్కే మళ్లీ ఈ పేసర్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.
ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ వేలంలో శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, జోష్ హేజిల్ వుడ్ లపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే, ఐపీఎల్ 2024 వేలంలో విదేశీ ఫాస్ట్ బౌలర్‌పై చెన్నై దృష్టి సారిస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీని కొనుగోలు చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రూ.12-14 కోట్లు ఖర్చు చేయవచ్చునని పేర్కొన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..
ఎంఎస్ ధోనీ, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మండల్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్ పాండే, మతీషా పతిరానా.