Asianet News TeluguAsianet News Telugu

మాదీ ఒక టీమేనా చెప్పండి! మాకు టైటిల్ గెలిచే అర్హత లేదు : ఆర్సీబీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

IPL 2023: ఐపీఎల్ లో మరో సీజన్   కూడా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.  ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  ఆ జట్టు  ఓటమిపాలైంది. 

IPL  2023: We weren't one of the best teams in the competition, Says RCB Skipper Faf Du Plessis
Author
First Published May 22, 2023, 4:59 PM IST

సీజన్లు మారుతున్నా  ఆర్సీబీ  కథ మారడం లేదు.   భారీ ఆశలు,  అంచనాలతో  ఐపీఎల్ -16 లో బరిలోకి దిగిన  బెంగళూరు.. ఈసారి  ప్లేఆఫ్స్ రేసులో  ఉండాలంటే తప్పక గెలవాల్సిన  మ్యాచ్ లో   భాగంగా గుజరాత్ టైటాన్స్  చేతిలో ఓడింది.  మ్యాచ్ ముగిసిన తర్వాత  ఆర్సీబీ కెప్టెన్  ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ టీమ్ కు ప్లేఆఫ్స్ చేరే అర్హత లేదని..   ఈ టోర్నీలో తాము అత్యుత్తమ జట్ల స్థాయిలో ఆడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  అధికారిక ట్విటర్ ఖాతాలో  షేర్ చేసిన వీడియోలో   మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల  ముఖాల్లో నైరాశ్యం,  డుప్లెసిస్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. 

ఈ వీడియోలో డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘ప్లేఆఫ్స్ వెళ్లే రేసులో మేం చివరి మ్యాచ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నందున ఇది చాలా కష్టం.   ఈ రాత్రి మేము టోర్నీలోనే టఫెస్ట్ టీమ్ తో ఆడుతున్నామని  తెలుసు.  గత రెండు మ్యాచ్ లలో గెలిచిన తర్వాత మేం  అదే ఊపులో దూసుకెళ్లాలని భావించాం. ద   కానీ గుజరాత్ టైటాన్స్ వంటి అగ్రశ్రేణి జట్టుతో ఆడుతున్నప్పుడు స్వంత గేమ్ లో అగ్రస్థానంలో ఉండాలి. మేం ఆధిపత్యం చెలాయించే  స్థితిలో ఉండాలి. కానీ మేం అలా చేయలేకపోయాం... 

 

ఈ సీజన్ లో వ్యక్తిగతంగా కొన్ని గొప్ప ప్రదర్శనలున్నాయి. అంతేగాక మేం నిలకడగా ఆడలేని కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.  మమ్మల్ని మేం  రివ్యూ చేసుకుంటే  మేం ప్రస్తుతం ప్లేఆఫ్స్ లో ఉన్న  ఉన్న టీమ్స్ లాగా అత్యుత్తమ  జట్లలో ఒకటిగా లేము.  మేం ప్లేఆఫ్స్ కు వెళ్లే అర్హతను కోల్పోయాం.   నేటి రాత్రి గుజరాత్ తో మ్యాచ్ గెలిచేందుకు మేం  చాలా ప్రయత్నించాం. కానీ ఆ మేరకు మేం సఫలం కాలేకపోయాం...’అని   డుప్లెసిస్ చెప్పాడు.  

ఈ సందర్భంగా  డుప్లెసిస్ సిరాజ్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపంచాడు.  ఈ సీజన్ లో సిరాజ్  తమ జట్టు తరఫున  అత్యుత్తమ ప్రదర్శన చేశాడని   కొనియాడాడు. అలాగే  గుజరాత్ బ్యాటర్  శుభ్‌మన్ గిల్ పై  కూడా  డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు.  గిల్ నమ్మశక్యం కాని ఆట ఆడాడని అన్నాడు.  తమ సీజన్  ను మరోసారి   నిరాశగా ముగించడం బాధగా ఉందని   కానీ ఈసారి తమకు కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయని  అన్నాడు. విరాట్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని  అతడి నిలకడ చాలా గొప్పగా ఉందని   ప్రశంసించాడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios