Asianet News TeluguAsianet News Telugu

క్యాచ్ పట్టి ముద్దు పెట్టి! మ్యాచ్ అయ్యాక భార్యతో స్టెప్పులేసి... విరాట్ కోహ్లీ ఫుల్లు స్వింగ్‌లో ఉన్నాడుగా...

IPL 2023: ఫాఫ్ డుప్లిసిస్ గాయపడడంతో రెండు మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించి, విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ... వరుస విజయాలతో భార్య అనుష్క శర్మతో కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియో షేర్ చేసిన...

IPL 2023: Virat Kohli gives flying kiss to Anushka Sharma and shakes few dance steps with wife CRA
Author
First Published Apr 24, 2023, 4:51 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్... ఈ నలుగురు తప్ప ఆర్‌సీబీలో మరో ప్లేయర్ సరిగ్గా ఆడింది లేదు. బ్యాటింగ్‌లో కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బాగా ఆడుతుంటే.. మిగిలిన బ్యాటర్లు అందరూ గ్రౌండ్ ఎలా ఉందో చెక్ చేయడానికి వెళ్లి వచ్చినట్టుగా అలా వెళ్లి, ఇలా అవుట్ అవుతున్నారు...

ఫాఫ్ డు ప్లిసిస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో గత రెండు మ్యాచుల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వ్యవహరించి, బ్యాటింగ్‌‌ మాత్రమే చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో గత రెండు మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ, రెండింట్లోనూ విజయాలు అందుకుంది...

కోహ్లీ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది..

ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటైన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ చరిత్రలో ఏడోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ టీ20ల్లో అవుట్ కావడం ఇదే తొలిసారి...

అయితే కోహ్లీ త్వరగా అవుటైనా ఫాఫ్ డుప్లిసిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి మూడో వికెట్‌కి 127 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ అవుట్ అయ్యాడు దినేశ్ కార్తీక్ 16, హసరంగ 6 విల్లే 4 పరుగులు చేయగా ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ డకౌట్ అయ్యారు..

ఈ లక్ష్యఛేదనలో ఆర్ఆర్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 182 పరుగులకి పరిమితమైంది. ఫీల్డింగ్‌లో రెండు క్యాచులు అందుకున్న విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ ఇచ్చిన క్యాచ్ అందుకున్నాక స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న తన భార్య అనుష్క శర్మ వైపు తిరిగి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు... అనుష్క నవ్వుతూ జవాబు ఇచ్చింది..

మ్యాచ్ అయ్యాక ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అనుష్క శర్మతో కలిసి స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ, మెల్లిమెల్లిగా ఆమెకు దగ్గరకి వెళ్లడంతో కాలు గట్టిగా తగిలింది. దీంతో కాస్త యాక్టింగ్ కూడా జోడించి, ‘ఆ...’ అంటూ అరుస్తూ సైడ్ అయిపోయాడు విరాట్ కోహ్లీ..

ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. అనుష్క శర్మ స్టేడియంలో ఉంటే మ్యాచ్‌పైన కంటే ఆమెపైనే విరాట్ కోహ్లీ ఫోకస్ పెట్టడం వింతేమీ కాదు. అయితే ఈ జోష్, ఐపీఎల్ కప్పు గెలిచిన తర్వాత చూపిస్తే తాము కూడా సంతోషిస్తామని కామెంట్లు పెడుతున్నారు ఆర్‌సీబీ ఫ్యాన్స్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios