ఇంపాక్ట్ ప్లేయర్ కావాలా నాయనా? అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ట్రోల్ చేసిన ‘దసరా’ టీమ్.. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని ‘దసరా’... రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతున్న జోరు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ కానీ, భారీ ఆశలు పెట్టుకున్న అయిడిన్ మార్క్‌రమ్ కానీ పెద్దగా మెప్పించలేకపోతున్నారు.
ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, అదిల్ రషీద్, ఫజల్‌హక్ ఫరూకీ... ఇలా వరల్డ్ క్లాస్ బౌలర్లతో ఐపీఎల్‌లో భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌గా గుర్తింపు తెచ్చుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే పేపర్ మీద ఉన్న స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న టీమ్, వికెట్లు తీయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతోంది..
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 140 మార్కును కూడా దాటలేకపోయింది..
మొదటి మ్యాచ్‌లో 204 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టి 131 పరుగులకే పరిమితమైంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ మామ వస్తాడు, సన్‌రైజర్స్‌ని గెలిపిస్తాడు అని ఆశపడ్డారు అభిమానులు. అయితే రెండో మ్యాచ్‌లో టీమ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్ గోల్డెన్ డకౌట్ అయ్యి, పెద్ద బొక్క పెట్టాడు...
దీంతో రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 121 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో అబ్దుల్ సమద్ సిక్సర్లు కొట్టకపోతే ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 100 కూడా దాటేది కాదు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని కాపాడాలంటే అఖిల్ అక్కినేని, ఎస్.ఎస్. థమన్ రావాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి..
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేందుకు ‘ధరణి’ సిద్ధంగా ఉన్నాడంటూ ప్రకటించింది ‘దసరా’ టీమ్. ‘నేచురల్ స్టార్’ నాని, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా కొత్త కుర్రాడు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొంది... మార్చి 30న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ‘దసరా’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘దసరా’ రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గకుండా దూసుకుపోతోంది..
ఈ వారం విడుదలైన సినిమాలకు డిజాస్టర్ టాక్ రావడం, నాని ‘దసరా’ సినిమాకి బాగా కలిసి వస్తోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేందుకు మా ‘ధరణి’ సిద్ధంగా ఉన్నాడంటూ క్రికెట్ ర్యాంప్ ప్రోమోని రిలీజ్ చేసింది టీమ్ యూనిట్..
‘ధరణికి ఫ్యాన్సీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారా? సన్‌రైజర్స్ హైదరాబాద్, సరైన ఇంపాక్ట్ ప్లేయర్ కోసం చూస్తున్నారా? మా ధరణి బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టి ఫుల్లు ఫామ్‌లో ఉన్నాడు...’ అంటూ ఈ ప్రోమోకి కాప్షన్ జోడించింది ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్..
ఆఖరికి మూవీ కూడా ఈ విధంగా ట్రోల్ చేస్తోందని, కనీసం ఇప్పుడైనా గెలవండి అంటూ ఈ పోస్టుకి కామెంట్లు చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌ని హైదరాబాద్ ఓడించగలదా? అనేది ఆసక్తికరంగా మారింది.
