IPL 2023: 79 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, 87 పరుగులు చేసిన డివాన్ కాన్వే... తొలి వికెట్‌కి 141 పరుగుల భారీ భాగస్వామ్యం.. ఆఖర్లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా మెరుపులు...
ఐపీఎల్ 2023 సీజన్ మొదటి క్వాలిఫైయర్‌కి రూట్ మ్యాప్‌గా మారిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది...
ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ...
కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, 20 పరుగులు రాబట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త ఫీల్డింగ్ కారణంగా రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న రుతురాజ్ గైక్వాడ్, 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి... చేతన్ సకారియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
తొలి వికెట్‌కి 141 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, డి వాన్ కాన్వే, ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ఇద్దరి మధ్య ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కి 182 పరుగుల భాగస్వామ్యం జోడించారు గైక్వాడ్- కాన్వే...
ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాదిన శివమ్ దూబే, 9 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి డివాన్ కాన్వే కూడా పెవిలియన్ చేరాడు..
52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో ఆమన్ హకీం ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నోకియా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 6, 4 బాది సీఎస్‌కే స్కోరుని 200 దాటించిన రవీంద్ర జడేజా, సకారియా వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు.
