Asianet News TeluguAsianet News Telugu

యాక్సిడెంట్ తర్వాత తొలిసారి గ్రౌండ్‌కి వచ్చిన రిషబ్ పంత్... కాలికి కట్టు, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌తో ...

IPL 2023: సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌కి హజరైన రిషబ్ పంత్... రిషబ్ పంత్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..

 

IPL 2023: Rishabh Pant watching DC vs GT and supporting Delhi Capitals in the stand cra
Author
First Published Apr 4, 2023, 8:22 PM IST

గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో నడవడానికి కూడా కష్టపడుతున్న రిషబ్ పంత్, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు...

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అతని ప్లేస్‌లో డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ అప్పగించింది ఢిల్లీ క్యాపిటల్స్. పంత్ లేకపోయినా, అతను ఉన్నట్టుగా ఫీల్ కలిగించేలా చేస్తామని చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, తొలి మ్యాచ్‌లో పంత్ 17 నెంబర్ జెర్సీని డకౌట్‌కి తగిలించాడు..

తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కి రిషబ్ పంత్ హాజరయ్యాడు. కాలికి కట్టుతో, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌తో రిషబ్ పంత్‌ స్టేడియంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు... కారులో స్టేడియానికి వచ్చిన రిషబ్ పంత్‌ని స్వయంగా స్వాగతం పలికిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్, అతని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 

ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు, ‘వీ మిస్ యూ ఆర్‌పీ’ అని రాసి ఉన్న రిషబ్ పంత్ 17 నెంబర్ భారీ జెర్సీని ప్రదర్శించి, మాజీ కెప్టెన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. సొంత మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, 8.3 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది..

పృథ్వీ షా 7, మిచెల్ మార్ష్ 4 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ కాగా కెప్టెన్ డేవిడ్ వార్నర్ 32 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసి అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  ఆ తర్వాతి బంతికి రిలే రసో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

రిషబ్ పంత్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం కావడంతో తొలి మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా వాడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో మ్యాచ్‌లో యంగ్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్‌కి అవకాశం కల్పించింది. 

రిషబ్ పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, క్రికెట్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి ఆరు నెలల నుంచి 8 నెలల వరకూ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. గాయం కారణంగా ఆసియా కప్ 2023 టోర్నీతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు దూరం కానున్నాడు రిషబ్ పంత్.. 

Follow Us:
Download App:
  • android
  • ios