Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 ఫైనల్‌కి చెన్నై సూపర్ కింగ్స్... క్వాలిఫైయర్‌లో చిత్తుగా ఓడిన గుజరాత్ టైటాన్స్...

మొదటి క్వాలిఫైయర్‌లో 15 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్ టైటాన్స్..  42 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆఖర్లో 30 పరుగులతో మెరుపులు మెరిపించిన రషీద్ ఖాన్.. 

IPL 2023 Qualifier 1: Chennai Super Kings Beats Gujarat Titans and reaches final of the 2023 season CRA
Author
First Published May 23, 2023, 11:23 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ని 15 పరుగుల తేడాతో చిత్తు చేసిన సీఎస్‌కే, రికార్డు స్థాయిలో 10వ సారి ఫైనల్ ఆడనుంది.. మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, రేపు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది. 

173 పరుగుల లక్ష్యఛేదనలో టైటాన్స్‌కి శుభారంభం దక్కలేదు. 11 బంతుల్లో 2 ఫోర్లు బాదిన వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, తీక్షణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన దసున్ శనక, జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 6 బంతుల్లో 4 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ కూడా జడ్డూ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

38 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసిన రాహుల్ తెవాటియాని, తీక్షణ అవుట్ చేయడంతో 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్...

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన విజయ్ శంకర్‌ని పథిరాణా అవుట్ చేయగా ఆ తర్వాతి బంతికి దర్శన్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు.


16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రషీద్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ ఓటమి ఖరారైపోయింది. 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే కలిసి తొలి వికెట్‌కి 87 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, మోహిత్ శర్మ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 3 బంతుల్లో 1 పరుగు చేసిన శివమ్ దూబే, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన అజింకా రహానే, దర్శన్ నల్కండే బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసిన డివాన్ కాన్వే, మహ్మద్ షమీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన అంబటి రాయుడు, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2 బంతుల్లో ఒక్క పరుగు తీసిన మహేంద్ర సింగ్ ధోనీ, మోహిత్ శర్మ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 16 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios