పరేషాన్ వద్దు.. పతిరాన నా మనిషి.. మీవోడు సేఫ్..! లంక పేసర్ కుటుంబానికి హామీ ఇచ్చిన ధోని

MS Dhoni: లంక యువ సంచలనం,  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న  మతీశ పతిరాన కుటుంబ సభ్యులు సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనిని కలిశారు. 

IPL 2023: Matheesha Pathirana Family Meets MS Dhoni, Share Pictures MSV

ఐపీఎల్ - 16 లో  చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదుగుతున్న యువ సంచలనం  మతీశ పతిరాన.. తన కుటుంబసభ్యులతో కలిసి చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనిని కలిశాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండో సీజన్ ఆడుతున్న పతిరాన.. ఈ సీజన్ లో  చెన్నైకి మెయిన్ బౌలర్ అయ్యాడు.   అయితే 20 ఏండ్ల కుమారుడిపై బెంగ పెట్టుకుని చెన్నైకి వచ్చిన  పతిరాన తల్లిదండ్రులకు.. అతడి కుటుంబానికి  ధోని ధైర్యం చెప్పాడు.  పతిరాన తన స్వంత మనిషి అని.. అతడి  భవిష్యత్ గురించి ఆందోళన చెందాల్సిన పన్లేదని  ధోని  వారికి హామీ ఇచ్చాడు. 

ఈ మేరకు పతిరాన సోదరి (విషుక పతిరాన) తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను పంచుకుని ధోని తమకు హామీ ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది.  చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో ధోనిని కలిసిన పతిరాన కుటుంబానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. మా మల్లి (పతిరాన ముద్దుపేరు) సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడని  రాసుకొచ్చింది. 

 

‘‘మా మల్లి ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు. ‘మీరు  పతిరాన గురించి  దిగులు చెందాల్సిన పన్లేదు.  అతడెప్పుడూ నాతోనే ఉంటాడు..’ అని తాలా మాకు చెప్పాడు. ధోనిని కలిసిన క్షణాలు నేను కలగన్నదానికంటే మించి ఉన్నాయి’’ అని ఆమె రాసుకొచ్చింది. 

 

కాగా  ఈ సీజన్ లో పతిరానను ధోని బాగా ప్రోత్సహిస్తున్నాడు.  చెన్నై మ్యాచ్ గెలిచిన ప్రతీసారి ధోని.. పతిరానపై ప్రశంసలు కురిపించాడు.   అతడు ఇప్పుడప్పడే టెస్టులకు రాకూడదని.. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఆడాలని సూచించాడు.   ఇక ఐపీఎల్-16 లో పతిరాన.. 11 మ్యాచ్ లలో  42.2 ఓవర్లు బౌలింగ్ వేసి  17 వికెట్లు పడగొట్టాడు.   ఇటీవలే చెన్నై - గుజరాత్ మధ్య జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్  మ్యాచ్ లో పతిరాన  నాలుగు ఓవర్లు వేసి  37 పరుగులిచ్చినా రెండు కీలక వికెట్లు తీశాడు.   ఇక గుజరాత్ పై గెలిచిన చెన్నై.. నేడు ముంబై - గుజరాత్ మధ్య జరుగబోయే క్వాలిఫయర్ -2 లో విజేతతో మే 28న ఫైనల్ ఆడనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios