IPL 2023, LSG vs MI Eliminator: ఆటతో కంటే ఆటేతర విషయాలతో ఫేమస్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌కు  కోహ్లీ,  ముంబై ఫ్యాన్స్ స్వీట్ మ్యాంగోస్ రుచి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. 

ఐపీఎల్ -16 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్లేఆఫ్స్ లో భాగంగా బుధవారం రాత్రి లక్నో - ముంబైల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిన తర్వాత నవీన్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. అతడిని ట్రోల్ చేస్తూ ఫ్యాన్సే కాదు.. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, ఆఖరికి స్విగ్గీ, జొమాటోలు కూడా ఆటాడుకున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

లక్నో - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీతో గొడవపడ్డ నవీన్ ఆ తర్వాత చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ముంబై - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ ఔటయ్యాక.. ముంబై మ్యాచ్ ను చూస్తూ.. ఓ గిన్నెలో మామిడి పండ్లను షేర్ చేస్తూ ‘స్వీట్ మ్యాంగోస్’అని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం తెలిసిందే.

ఇక అప్పట్నుంచి నవీన్.. కోహ్లీతో పాటు దాదాపు భారతీయ అభిమానులందరికీ ట్రోలింగ్ సరుకు అయ్యాడు. నిన్న ముంబైతో మ్యాచ్ లో నవీన్.. నాలుగు వికెట్లతో రాణించిన తర్వాత కూడా కెఎల్ రాహుల్ స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకోవడం వారికి మరింత ఆగ్రహాన్ని కలిగించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిన తర్వాత అభిమానులు మాత్రం నవీన్ పై జాలి, దయ, కరుణ అన్నవాటిని మరిచిపోయి ట్రోలింగ్ కు దిగారు. నవీన్ ను మామిడి పండ్లు అమ్ముతున్న వాడిగా మీమ్స్ క్రియేట్ చేసి ఆటాడుకుంటున్నారు.

Scroll to load tweet…

ముంబై - లక్నో మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై ఆటగాళ్లు కుమార్ కార్తీకేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ లు కూడా ఓ టేబుల్ ముందు మామిడి పండ్లను పెట్టి ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అన్న స్టైల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోను ముంబై ఆటగాడు సందీప్ వారియర్ తన ట్విటర్ లో పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేశాడు.

Scroll to load tweet…

ఇక నవీన్ ను కోహ్లీ ఫ్యాన్స్, ముంబై ఆటగాళ్లు మాత్రమే కాదు ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీలు కూడా అతడిని ట్రోల్ చేశాయి. జొమాటో.. తన ట్విటర్ లో నవీన్ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి ‘నాట్ సో స్వీట్ మ్యాంగోస్’ అని పోస్ట్ పెట్టింది. స్విగ్గీ కూడా మామిడి పండ్లను కట్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ ట్రోల్ చేసింది. కోహ్లీ ఫ్యాన్స్ పుణ్యమా అని తన ప్రదర్శనలతో ఎప్పుడు ఇంత ఫేమస్ కాని నవీన్.. ఈ మ్యాచ్ తర్వాత నెట్టింట ట్రెండింగ్ లోకి రావడం గమనార్హం. హ్యాష్ ట్యాగ్ నవీన్ (#Naveen Ul Haq) తో పాటు స్వీట్ మ్యాంగోస్ (#Sweet Mangoes) కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Scroll to load tweet…