11:04 PM (IST) May 28

ఐపీఎల్ -16 ఫైనల్ వాయిదా.. ముంచిన వరుణుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం 6.40 గంటల నుంచి మొదలైన వాన ఆగుతూ కురుస్తూ అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఈ మ్యాచ్ ను సోమవారానికి వాయిదా వేశారు. ఐపీఎల్-16 ఫైనల్ కు రిజర్వ్ డే ఉండటంతో ఈ మ్యాచ్ ను రేపు జరిపించనున్నారు. సోమవారం రాత్రి 9.00 గంటలకు వర్షం కాస్త తెరిపినిచ్చినా మళ్లీ 20 నిమిషాల గ్యాప్ లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. 11 గంటల వరకూ మ్యాచ్ జరిపేందుకు యత్నించిన అంపైర్లు.. ఇక ఆట వీలుకాదని రేపటికి వాయిదా వేశారు. సోమవారం సరిగ్గా ఇదే వేదికపై రాత్రి.. 7.00 గంటలకు మొదలవుతుంది. మరి రేపైనా వరుణుడు అహ్మదాబాద్ లో కరుణిస్తాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి.

Scroll to load tweet…
10:39 PM (IST) May 28

11:30 గంటల దాకా వర్షం తగ్గకుంటే రేపటికి వాయిదానే..!

ఐపీఎల్ - 16 ఫైనల్ జరగాల్సి ఉన్న అహ్మదాబాద్‌లో వరుణుడు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో నేడు మ్యాచ్ జరిగేది కష్టమే అనిపిస్తోంది. సాయంత్రం టాస్ కు ముందు మొదలైన వర్షం.. ఆగుతూ కురుస్తూ టాస్ కూడా వేయనీయకుండా ఆటాడిస్తున్నది. అయితే అంపైర్లు నితిన్ మీనన్, రాడ్ టకర్ లు తాజాగా జియో సినిమాతో మాట్లాడుతూ.. తాము మ్యాచ్ జరిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, రాత్రి 11:30 వరకూ వేచి చూస్తామని చెప్పారు. ఇవాళ కట్ ఆఫ్ టైమ్ రాత్రి 12:06 గంటల వరకు ఉన్న నేపథ్యంలో ఆలోపు వీలైతే ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరిపిస్తామని చెప్పారు. అహ్మదాబాద్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇవాళ మ్యాచ్ జరిగే అవకాశాలు బొత్తిగా కనిపించడం లేదు. 

Scroll to load tweet…
10:11 PM (IST) May 28

ఓవర్ల కుదింపు మొదలైంది...

అనుకున్నదే అయింది. వర్షం కారణంగా ఐపీఎల్-16 ఫైనల్ లో వరుణుడు విడవకుండా దంచికొడుతుండటంతో అహ్మదాబాద్ తడిసి ముద్దవుతున్నది. 9.45 గంటల తర్వాత మ్యాచ్ లో ఓవర్ల కుదింపు మొదలవుతుందని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో 9 గంటలకు కాస్త తెరిపినిచ్చిన వరుణ దేవుడు 9.20 గంటలకు మళ్లీ మొదలయ్యాడు. దీంతో ప్రాక్టీస్ కోసమని గ్రౌండ్ లోకి వచ్చిన ఆటగాళ్లు, పిచ్ పరిశీలనకు వచ్చిన అంపైర్లు.. మళ్లీ డగౌట్ కు పరిగెత్తారు. ఇక కట్ ఆఫ్ టైమ్ దగ్గరపడుతుండటంతో ఈ మ్యాచ్ లో ఓవర్ల కుదింపు కూడా మొదలైంది.

కుదింపు ఇలా : 

9:45 PM ప్రారంభమైతే : 19 ఓవర్స్ మ్యాచ్ (ఒక్కో జట్టుకు) 

10:000 PM: 17 ఓవర్స్ 

10:15 PM: 15 ఓవర్స్ (ప్రస్తుతానికి ఇవి మూడు దాటిపోయినట్టే) 

10:30 PM: 12 ఓవర్స్

11:30 PM: 09 ఓవర్స్ 

నేడు ఫైనల్ కట్ ఆఫ్ టైమ్.. 12:06 గంటలు. ఆలోపు వీలైతే ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరిపిస్తారు. 

Scroll to load tweet…
09:46 PM (IST) May 28

ఐపీఎల్-16 ఫైనల్‌తో ఆటాడుకుంటున్న వరుణుడు..

అహ్మదాబాద్‌ లో వరుణుడు టామ్ అండ్ జెర్రీ ఆడుతున్నాడు. తగ్గినట్టే తగ్గిన వాన దేవుడు ఆటగాళ్లు గ్రౌండ్ లోకి రాగానే మళ్లీ.. ‘మీరు మళ్లెందుకు వచ్చార్రా.. నేను పోలేదుగా ఇంకా..’ అనుకుంటూ మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఇప్పట్నుంచి ఓవర్ల కుదింపు ప్రారంభం కానుంది. మరి వరుణుడు ఇంకెన్ని షాకులిస్తాడో..!

09:17 PM (IST) May 28

కాసేపట్లో టాస్..?

అహ్మాదాబాద్ లో వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 9.35 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్ల కుదింపు ఉండదు. లేదంటే ఓవర్లు తగ్గుతూ వస్తాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను ఫుల్ గా నిర్వహించేందుకు బీసీసీఐ యత్నిస్తున్నది. వర్షం తగ్గాక అంపైర్లతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కూడా గ్రౌండ్ లోకి వచ్చి వారితో చర్చించారు. త్వరలోనే టాస్ పడే అవకాశాలున్నాయి. 

Scroll to load tweet…
09:10 PM (IST) May 28

గుడ్ న్యూస్.. నిలిచిన వర్షం..

ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అహ్మదాబాద్ లో రెండుగంటలపాటు దంచికొట్టిన వరుణుడు ఎట్టకేలకు శాంతించాడు. కొద్దిసేపటి క్రితమే వాన ఆగడంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీద కప్పి ఉంచిన కవర్లను తీసేస్తున్నారు. రోలర్స్ ఔట్ ఫీల్డ్ ను సిద్ధం చేస్తుండగా ప్లేయర్లు ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ లోకి వస్తున్నారు. 

08:40 PM (IST) May 28

ఆగి మళ్లీ మొదలైన వాన.. అభిమానుల్లో ఆందోళన..

అహ్మదాబాద్‌లో వర్షం వెలిసేలా కనిపించడం లేదు. సాయంత్రం 6.30 గంటల నుంచి దంచికొడుతున్న వరుణుడు.. 8.20 గంటలకు కాస్త తెరిపినిచ్చాడు. హమ్మయ్య.. ఇక తగ్గింది అనుకునేలోపే వాన మొదలైంది. ఇప్పటికిప్పుడు వర్షం ఆగినా మ్యాచ్ ప్రారంభం కావాలన్నా గంటన్నరకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు. 

Scroll to load tweet…
08:24 PM (IST) May 28

ఐపీఎల్-16లో మెరుపులు.. మలుపులు.. ఘనతలు..

- ఈ సీజన్‌లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌లో భాగంగా ఈ నిబంధన ద్వారా వచ్చిన ఫస్ట్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండే. ఐపీఎల్-16 లో భాగంగా గుజరాత్ - చెన్నై మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో సీఎస్కే తరఫున అతడు ఎంట్రీ ఇచ్చాడు. 

- ఫస్ట్ ఫైఫర్ తీసింది లక్నో పేసర్ మార్క్ వుడ్.. లక్నో - ఢిల్లీ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. 

- గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రింకూ సింగ్ ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది కోల్కతా నైట్ రైడర్స్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. 

- రాజస్తాన్ - చెన్నై మధ్య జరిగిన థ్రిల్లర్‌లో ధోని వీరబాదుడు బాదినా సందీప్ శర్మ అద్భుత బౌలింగ్ తో ఏడు పరుగులను డిఫెండ్ చేశాడు. 

- సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్.. ఈ సీజన్ లో ఫస్ట్ సెంచరీ బాదాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఘనత సాధించాడు.

- బ్రూక్ తర్వాత కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ కూడా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఐపీఎల్ లో కేకేఆర్ కు ఇది రెండో సెంచరీ. 

- పంజాబ్ - ముంబై మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఆఖరి ఓవర్లో ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ, నెహల్ వధేరలు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్స్ రెండు ముక్కలయ్యాయి. ఇదే ముంబై తమ తర్వాత మ్యాచ్ లో పంజాబ్ ను చిత్తుగా ఓడించింది. 

Scroll to load tweet…

- ఈ సీజన్ లో బ్రూక్, వెంకటేశ్ అయ్యర్‌తో పాటు యశస్వి జైస్వాల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ లు సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మురింపించాడు. శుభ్‌మన్ గిల్ కూడా మూడు సెంచరీలు చేశాడు. 

- ముంబై - గుజరాత్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో రషీద్ ఖాన్.. పది సిక్సర్లతో వీరవిహారం చేసి ముంబైకి షాకిచ్చినంత పని చేశాడు. 

- సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ అభిషేక్ శర్మ వైఫల్యంతో లక్నో సూపర్ డూపర్ విక్టరీ కొట్టింది. పూరన్ కు పూనకం వచ్చినట్టు ఊగాడు. 

- మే 1న లక్నో - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ.. నవీన్ ఉల్ హక్ తో పాటు గంభీర్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కోహ్లీ-నవీన్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. 

Scroll to load tweet…

- స్లో ఓవర్ రేట్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఈసారి బీసీసీఐకి జరిమానాల రూపంలో కోటిన్నర రూపాయల ఆదాయం వచ్చింది.

- ఈ సీజన్ లో ముంబై.. నాలుగుసార్లు 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించింది.

08:03 PM (IST) May 28

వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న గుజరాత్ కోచ్.. ఇంత టెన్షన్‌లో కూడా ఎలా సామి..?

ఒకవైపు ఫుల్ సీరియస్ తో మ్యాచ్ జరిగితే కొబ్బరి బొండాంలో స్ట్రా వేసుకుని తాఫీగా తాగుతూ బౌండరీ లైన్ వద్ద అటూ ఇటూ తిరిగే గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా.. అహ్మదాబాద్ లో వర్షాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందో లేదోనని కోట్లాది మంది అభిమానులు ఆందోళన పడుతుంటే నెహ్రా మాత్రం వర్షపు చినుకులతో ఆడుకుంటూ గడుపుతున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

Scroll to load tweet…
07:40 PM (IST) May 28

రిజర్వ్ డే ఉందా లేదా..?

అహ్మదాబాద్‌లో వరుణుడు కుండపోత వర్షంతో కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం.. ఐపీఎల్-16 ఫైనల్ కు రిజర్వ్ డే లేదని.. నేటి రాత్రి 12:26 గంటల వరకూ వర్షం నిలిచిపోకుంటే అప్పుడు ఐదు ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని పోస్టులు వైరల్ అవుతున్నాయి. కనీసం సూపర్ ఓవర్ ద్వారా అయినా మ్యాచ్ ఫలితం నిర్ణియించే అవకాశం ఉందని ట్వీట్స్ వస్తున్నాయి. క్రిక్ బజ్ లో కూడా ఇదే సమాచారాన్ని పోస్ట్ చేశారు.

Scroll to load tweet…

కానీ తర్వాత క్రిక్ బజ్.. రిజర్వ్ డే ఉందని బీసీసీఐ అధికారులు క్లారిటీ ఇచ్చారని తెలిపింది. అయితే ఇవాళ మ్యాచ్ కట్ ఆఫ్ టైమ్.. రాత్రి 12:06 గంటలు. అది కూడా ఐదు ఓవర్ల మ్యాచ్ కే సాధ్యమవుతుంది. 

Scroll to load tweet…
07:14 PM (IST) May 28

వరుణుడు కరుణించకుంటే..?

అహ్మదాబాద్‌లో వాన దంచికొడుతుండటంతో ఐపీఎల్ అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అని నరేంద్ర మోడీ స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులతో పాటు టీవీలు, మొబైల్ తెరల ముందు ఉన్న కోట్లాది మంది అభిమానులలో ఆందోళన మొదలైంది. అయితే ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డే కంటే ముందు నేడు రాత్రి 9:30 గంటల వరకూ ఒక్క ఓవర్ కూడా పడకుండా ఉంటే..అప్పుడు మ్యాచ్ ను కుదిస్తారు. రాత్రి 11:50 గంటల వరకు వాన ఆగితే ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుంది. అదీ కూడా వీలుకాని సందర్భంలో మే 29న రిజర్వ్ డే ఉంది. ఇక రేపు కూడా ఇదే సీన్ రిపీట్ అయితే గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 

Scroll to load tweet…
07:06 PM (IST) May 28

దంచికొడుతున్న వాన.. టాస్ ఆలస్యం..

ఐపీఎల్-16 ఫైనల్ మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. అహ్మదాబాద్ లో వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. నరేంద్రమోడీ స్టేడియంలతో కొద్దిసేపటిక్రితమే మొదలైన వాన.. ఇప్పుడు దంచికొడుతున్నది. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతానికైతే అంపైర్లు టాస్, మ్యాచ్ సమయంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. 

Scroll to load tweet…
07:03 PM (IST) May 28

అలరించిన నుక్లెయ..

వర్షం వల్ల ఐపీఎల్ -16 ఫైనల్ కు అంతరాయం కలుగుతున్నా ముగింపు వేడుకలు మత్రం ఘనంగా జరిగాయి. ప్రముఖ సంగీత దర్శకుడు , ర్యాపర్ న్యుక్లెయ.. బాలీవుడ్, పంజాబీ పాటలతో అహ్మదాబాద్‌ను అలరించాడు. 

Scroll to load tweet…
06:41 PM (IST) May 28

అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్ జరిగేనా..?

ఐపీఎల్-16 ఫైనల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు వరుణుడు షాకిచ్చేలా ఉన్నాడు. ఫైనల్ జరిగే అహ్మదాబాద్‌లో వర్షం మొదలైంది. దీంతో పిచ్ పై కవర్స్ కప్పి ఉంచారు. వర్షం వల్ల టాస్ తో పాటు మ్యాచ్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ వరుణుడు ఇవాళ కరుణించకుంటే ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. సాయంత్రం 6.30 గంటలకు చిరుజల్లులుగా మొదలైన వాన.. క్రమంగా పెరుగుతోంది.

Scroll to load tweet…
06:37 PM (IST) May 28

చెన్నై బలం ఆ ముగ్గురే..

చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాటింగ్‌లో ఏడో నెంబర్ బ్యాటర్ దాకా పరుగులు చేసే సామర్థ్యమున్నా.. ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున ఎక్కువ పరుగులు చేసింది ముగ్గురే. ఓపెనర్ డెవాన్ కాన్వే.. 15 మ్యాచ్ లలో 14 ఇన్నింగ్స్ ఆడి 52.08 సగటుతో 625 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 15 మ్యాచ్ లలో 14 ఇన్నింగ్స్ ఆడి 43.38 సగటుతో 564 పరుగులు చేశాడు. గైక్వాడ్ కూడా నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తున్న శివమ్ దూబే.. 15 మ్యాచ్ లలో 35 సగటుతో 386 పరుగులు సాధించాడు. నేడు ఫైనల్ లో కూడా చెన్నైకి ఈ ముగ్గురే కీలకం కానున్నారు. 

06:29 PM (IST) May 28

గుజరాత్ బలం బలగం అతడే..

ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ బలం బలగం శుభ్‌మన్ గిల్ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ సీజన్‌లో అతడు 16 మ్యాచ్ లలో ఏకంగా 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. హార్ధిక్ తర్వాత గుజరాత్ టైటాన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ హార్ధిక్ పాండ్యా (325) అంటేనే గుజరాత్.. గిల్ మీద ఎంత ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు. 

06:23 PM (IST) May 28

సమఉజ్జీలే..

ఐపీఎల్-16 ఫైనల్ సమరంలో తలపడబోయే గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ రెండూ సమఉజ్జీలే. స్టార్లను కాకుండా సమిష్టితత్వాన్ని నమ్ముకున్న ఈ రెండు జట్లూ.. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో టాప్ -2గా నిలిచాయి. బ్యాటింగ్‌లో చెన్నై కాస్త బెటర్ పొజిషన్ లో ఉండగా.. గుజరాత్ టైటాన్స్‌కు బౌలింగే బలం. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బ్యాటర్లలో టాప్ -3 ఆ జట్టుకు చెందినవారే. మహ్మద్ షమీ (28), రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ (24 ) గుజరాత్ బౌలర్లే. 

06:12 PM (IST) May 28

అంబటి రాయుడు రిటైర్మెంట్..

ఐపీఎల్ -16 ఫైనల్స్‌కు మరికొద్దిసేపటి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ స్టార్, ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో 203 మ్యాచ్ లు ఆడిన రాయుడు.. 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.

Scroll to load tweet…