Asianet News TeluguAsianet News Telugu

IPL 2023: రివేంజ్‌కు ముంబై రెడీ.. సొంతగడ్డపై బలంగా చెన్నై.. కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని సేన

IPL 2023, CSK vs MI: ఐపీఎల్-16 లో నేడు రెండో ‘ఎల్ క్లాసికో’ జరుగనుంది.  చెన్నై సూపర్ కింగ్స్ తో  వారి స్వంత గ్రౌండ్  లో రివేంజ్ తీర్చుకునేందుకు  రోహిత్ సేన సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో ధోని సేన టాస్ నెగ్గింది. 

IPL 2023, CSK vs MI: Chennai Super Kings Won The Toss and  opt bowl First vs Mumbai Indians MSV
Author
First Published May 6, 2023, 3:04 PM IST | Last Updated May 6, 2023, 3:11 PM IST

ఐపీఎల్ -2023 సీజన్‌లో మరో డబుల్ హెడర్ వీక్ వచ్చింది.  శనివారం చెన్నైలోని చెపాక్ వేదికగా  చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య   ఈ సీజన్ లో రెండో ‘ఎల్ క్లాసికో’  జరుగుతున్నది.  ఇదే సీజన్ లో ఇరు జట్ల మధ్య వాంఖెడే వేదికగా ముగిసిన  పోరులో చెన్నైదే పైచేయి అయింది. తాజాగా  ముంబై దానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది.  ఈ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు రానుంది. 

ఇప్పటివరకు ఈ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే  ఐదు మ్యాచ్ లలో గెలిచి నాలుగింటిలో ఓడి (ఒకదాంట్లో ఫలితం తేలలేదు)  పాయింట్ల పట్టికలో  మూడో స్థానంలో ఉంది.  నేటి మ్యాచ్ లో గెలిస్తే ఆ జట్టు  టాప్ -2 కు ఎగబాకనుంది. 

ఇక ముంబై విషయానికొస్తే  ఐపీఎల్-16లో  9 మ్యాచ్ లు ఆడి  ఐదు గెలిచి నాలుగు ఓడి   పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం అందుకుంటే  ముంబై  ఆర్సీబీతో పాటు  రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్  ను కూడా అధిగమించి టాప్ -2 జట్టుగా  ఉండే అవకాశాలున్నాయి.  

హెడ్ టు హెడ్ : 

ముంబై - చెన్నై మధ్య  ఇప్పటివరకు  35 మ్యాచ్ లు జరుగగా ఇందులో  20 సార్లు ముంబై.. 15  సార్లు చెన్నై నెగ్గింది. ఈ రెండు జట్లూ  ఇప్పటివరకు లీగ్ దశలో 26 సార్లు తలపడ్డాయి.   ఇందులో 15 సార్లు ముంబై.. 11 సార్లు  చెన్నై గెలిచింది.

 

తుది జట్లు :  ఈ మ్యాచ్ కోసం చెన్నై గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా ముంబై మాత్రం రెండు మార్పులతో ఆడనుంది. ముంబై కీలక బ్యటర్ తిలక్ వర్మ  స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఈ మ్యాచ్ లో అతడు అందుబాటులో లేడు. 

చెన్నై సూపర్ కింగ్స్ :  రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మోయిన్ అలీ,  శివమ్ దూబే,  రవీంద్ర జడేజా,  ఎంఎస్ ధోని (కెప్టెన్), దీపక్ చాహర్, మతీశ పతిరాన, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ 

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహల్ వధేరా,  జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios