Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 CSK vs LSG: టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై బోణీ కొడుతుందా..

IPL 2023: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్... మూడేళ్ల తర్వాత సొంత గ్రౌండ్‌లో ధోనీ సేన.. 

IPL 2023 CSK vs LSG: Lucknow Super giants won the toss and elected to field first, Chennai cra
Author
First Published Apr 3, 2023, 7:05 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు.. నేటి మ్యాచ్‌లో గెలిచి సీఎస్‌కే, 2023 సీజన్‌లో బోణీ చేయాలని అనుకుంటుంటే, గత మ్యాచ్‌లో వచ్చిన విజయాన్ని కొనసాగించాలని లక్నో ఆశపడుతోంది.. 

2019 తర్వాత తొలిసారిగా సొంత మైదానంలో మ్యాచ్ ఆడుతోంది చెన్నై సూపర్ కింగ్స్. అదీకాకుండా ఇప్పటిదాకా 2023 సీజన్‌లో జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో సొంత మైదానంలో ఆడిన జట్లే గెలిచాయి. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది..

చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన సురేష్ రైనా లేకుండా తొలిసారిగా చెన్నైలో మ్యాచ్ ఆడుతోంది సీఎస‌కే. అలాగే మూడు సీజన్లుగా చెన్నైకి కీలక ప్లేయర్‌గా మారిన రుతురాజ్ గైక్వాడ్ తొలిసారిగా చెన్నైలో మ్యాచ్ ఆడబోతున్నాడు..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటింగ్‌లో 7 పరుగులు చేసి అవుటైన బెన్ స్టోక్స్, బౌలింగ్ కూడా చేయలేదు. అలాగే అంబటి రాయుడు, రవీంద్ర జడేజా కూడా ఫెయిల్ అయ్యారు.. మొదటి మ్యాచ్‌లో  చెన్నై బ్యాటింగ్ అంతా రుతురాజ్ గైక్వాడ్‌పైనే ఆధారపడితే, లక్నో సూపర్ జెయింట్స్ కైల్ మేయర్స్‌ మెరుపుల వల్ల గట్టెక్కింది...

దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహార్, మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, తొలి మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్ కూడా పెద్దగా మెప్పించలేకపోయారు. అయితే మార్క్ వుడ్ తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి లక్నోకి ఘన విజయాన్ని అందించాడు.  గత మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చిన జయ్‌దేవ్ ఉనద్కట్‌ని తప్పించిన లక్నో, యష్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది.. 

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇది: కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, మార్క్ వుడ్, రవి భిష్ణోయ్, యష్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహార్, రాజ్‌వర్థన్ హంగర్‌గేకర్

Follow Us:
Download App:
  • android
  • ios