Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ మినీ వేలంలో 405 మంది క్రికెటర్లు.. . తొలి సెట్‌లోనే మయాంక్ అగర్వాల్, రూట్, విలియంసన్...

డిసెంబర్ 23న కొచ్చిలో ఐపీఎల్ 2023 మినీ వేలం... 991 మంది ప్లేయర్ల నుంచి 405 మందిని షార్ట్ లిస్ట్ చేసిన 10 ఫ్రాంఛైజీలు... తొలి సెట్‌లో వేలానికి మయాంక్ అగర్వాల్, అజింకా రహానే... 

IPL 2023 auction list announced; 405 cricketers set to go under the hammer, Mayank Agarwal
Author
First Published Dec 13, 2022, 6:11 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలానికి లిస్టు ఖరారు అయిపోయింది. ఈ వేలానికి మొత్తంగా 991 ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా అందులో నుంచి 369 మంది ప్లేయర్లను 10 జట్లు కలిసి షార్ట్ లిస్టు చేశాయి. ఆ తర్వాత మరో 36 మంది ప్లేయర్లను చేర్చాల్సిందిగా ఫ్రాంఛైజీల నుంచి రిక్వెస్ట్ రావడంతో వేలంలో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 405కి చేరింది...

మినీ వేలంలో పాల్గొనే 405 మంది ప్లేయర్లలో 273 మంది భారతీయులు కాగా 132 మంది విదేశీ క్రికెటర్లు. అసోసియేట్ దేశాల నుంచి కేవలం నలుగురు ప్లేయర్లు మాత్రమే ఈ షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోగలిగారు. మినీ వేలంలో పాల్గొనే ప్లేయర్లలో 119 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా, 282 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు...

మొత్తంగా 10 ఫ్రాంఛైజీల్లో కలిపి 87 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 మంది ఫారిన్ ప్లేయర్లు మాత్రమే తమ అదృష్టాన్ని వెతుక్కోబోతున్నారు. వేలంలో పాల్గొనే ప్లేయర్లలో 19 మంది ఫారిన్ ఆటగాళ్లు, రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలో దిగుతున్నారు. మరో 11 మంది రూ. కోటిన్నర బేస్ ప్రైజ్ సెట్‌లో ఉన్నారు.

 రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో పాటు రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్ సెట్స్‌లో కూడా ఒక్క భారతీయ ప్లేయర్లు కూడా లేకపోవడం విశేషం. మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే వంటి క్రికెటర్లతో పాటు మరో 20 మంది రూ.1 కోటి సెట్‌లో వేలానికి రాబోతున్నారు. 

డిసెంబర్ 23న కొచ్చిలో జరిగే ఈ మినీ వేలాన్ని... ఐపీఎల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో (వయాకామ్ 18) ప్రత్యేక్ష ప్రసారం చేయబోతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో టీవీల్లో, జియో సినిమా యాప్‌లో లేదా వూట్ యాప్‌లో మొబైళ్లలో ఈ మినీ వేలాన్ని వీక్షించవచ్చు...


భారత ప్లేయర్లు మయాంక్ అగర్వాల్, అజింకా రహాతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్, సౌతాఫ్రికా క్రికెటర్ రిలే రొస్సో, న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియంసన్... తొలి సెట్‌లో వేలానికి రాబోతున్నారు. వీరిలో జో రూట్, అజింకా రహానేలను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది...

రెండో సెట్‌లో సామ్ కుర్రాన్, కామెరూన్ గ్రీన్, షకీబ్ అల్ హసన్, జాసన్ హోల్డర్, సికిందర్ రజా, ఓడియన్ స్మిత్, బెన్ స్టోక్స్ వేలానికి వస్తారు.. 10 ఫ్రాంఛైజీల్లో అత్యధిక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో 13 స్థానాలు ఖాళీగా ఉండగా కేకేఆర్ 11, లక్నో సూపర్ జెయింట్స్ 10 స్థానాలను భర్తీ చేసుకోవాల్సి ఉంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌లో 9 స్థానాలు ఖాళీగా ఉండగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీలో 7 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి... ఢిల్లీ క్యాపిటల్స్‌లో అతి తక్కువగా ఐదు స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios