Asianet News TeluguAsianet News Telugu

IPL: తలలు మారిన పర్పుల్ క్యాప్.. చాహల్ తో సమానమైనా కిరీటం అతడికే...

IPL 2022 Purple Cap: ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన వీరుడికి ఇచ్చే  పర్పుల్ క్యాప్ చాలా మ్యాచుల తర్వాత తలలు మారింది.  ఇన్నాళ్లు రాజస్తాన్ రాయల్స్  బౌలర్ యుజ్వేంద్ర చాహల్ దీనిని అట్టిపెట్టుకున్నాడు. కానీ.. 

IPL 2022: Wanindu Hasaranga clinches Purple Cap From Yuzvendra chahal
Author
India, First Published May 14, 2022, 5:07 PM IST

ఐపీఎల్-2022 ప్రారంభమయ్యాక  చాలా మ్యాచుల పాటు  రాజస్తాన్ రాయల్స్ వద్దే ఉన్న  ఐపీఎల్ పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసుకున్న వారికి ఇచ్చేది) తొలిసారి తలలు మారింది.  ఇన్నాళ్లు రాజస్తాన్ రాయల్స్  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల మీద ఉన్న ఈ క్యాప్.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ వనిందు హసరంగ మీదకు వచ్చింది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో  హసరంగ రెండు వికెట్లు తీయడంతో  చాహల్ తో సమానంగా నిలిచాడు. హసరంగ, చాహల్ లు చెరో 23 వికెట్లతో నిలిచినా ఆర్సీబీ బౌలర్ కే  పర్పుల్ క్యాప్ దక్కడం విశేషం. 

ఈ సీజన్  ప్రారంభంలో  ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసినవారికి ఇచ్చేది) పలుమార్లు ఫాఫ్ డుప్లెసిస్, జోస్ బట్లర్ మధ్య చేతులు మారినా పర్పుల్ క్యాప్ మాత్రం  చాహల్ ను దాటి బయటకు పోలేదు.  చాలా మ్యాచుల వరకు రాజస్తాన్ రాయల్స్ కు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్లు (బట్లర్, చాహల్) ఈ రెండు  క్యాప్ లను అట్టిపెట్టుకున్నారు. 

ఇప్పటికీ ఆరెంజ్ క్యాప్ బట్లర్ వద్దే ఉండగా పర్పుల్ క్యాప్ మాత్రం హసరంగ దగ్గరికి వెళ్లింది. ఈ సీజన్ లో  హసరంగ.. 13 మ్యాచుల్లో 45 ఓవర్లు బౌలింగ్ చేసి 337 పరుగులిచ్చి  14.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు.  ఇక చాహల్.. 12 మ్యాచులలో 48 ఓవర్లు బౌలింగ్ చేసి.. 362 పరుగులిచ్చి 15.74 సగటుతో 23 వికెట్లు తీశాడు. అయితే చాహల్ కంటే 0.05 ఎకానమీ  బెటర్ గా ఉండటంతో  హసరంగకు  పర్పుల్ క్యాప్ వశమైంది.  

 

అయితే  హసరంగను అధిగమించడం పెద్ద విషయమేమీ కాదు.  ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారగా.. రాజస్తాన్ మాత్రం ప్లేఆఫ్ రేసులో మరో రెండు మ్యాచులు ఆడుతుంది. ఈ రెండు మ్యాచులలో చాహల్  హసరంగ ను అధిగమించడమే గాక తిరిగి టాప్ లోకి చేరుకోవచ్చు. 

 

ఇదిలాఉండగా.. హసరంగకు పర్పుల్ క్యాప్ దక్కడం పై రాజస్తాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్, శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘కంగ్రాచ్యులేషన్స్ హసరంగ..  శ్రీలంక  ఆటగాళ్లు  ఐపీఎల్ లో తమ ప్రతిభ  చూపిస్తుండటం సంతోషంగా ఉంది.  ఇద్దరు టాప్ స్పిన్నర్లైన చాహల్,  హసరంగ మధ్య ఈ పర్పుల్ క్యాప్ యుద్ధం రసవత్తరంగా సాగుతుండటం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios